iDreamPost
android-app
ios-app

తమిళంలో రీమేక్ అవుతున్న ‘బేబీ’! డైరెక్టర్, యాక్టర్స్ ఎవరంటే..

  • Author ajaykrishna Updated - 11:57 AM, Tue - 3 October 23
  • Author ajaykrishna Updated - 11:57 AM, Tue - 3 October 23
తమిళంలో రీమేక్ అవుతున్న ‘బేబీ’! డైరెక్టర్, యాక్టర్స్ ఎవరంటే..

ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలు వివిధ భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ బాగుండి సినిమా సూపర్ హిట్ అయితే చాలు.. వేరే ఇండస్ట్రీస్ నుండి మేకర్స్ ఆసక్తి చూపించడం జరుగుతుంటుంది. అయితే.. ఇప్పుడు ఓ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ తమిళంలో రీమేక్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే బేబీ మూవీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా.. విరాజ్ కీలకపాత్రలో నటించిన సినిమా బేబీ. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని.. SKN నిర్మించారు. ఈ ఏడాది జులైలో విడుదలైన బేబీ.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.

ఇక ఈ సినిమాతో అటు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. అలాగే డెబ్యూ హీరోయిన్ గా వైష్ణవి సూపర్ సక్సెస్ తో పాటు.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కీలక నటుడుగా విరాజ్ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే.. సినిమా కూడా పాజిటివ్ టాక్ తో నిర్మాతలకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. రూ. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన బేబీ.. సుమారు రూ. 80 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. ఈ సినిమాకు ఇండస్ట్రీ వర్గాల నుండి మాత్రమే కాకుండా యూత్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభించింది. కట్ చేస్తే.. ఈ సినిమా కూడా తమిళంలో రీమేక్ అయ్యేందుకు రెడీ అవుతోందట.

తాజా సమాచారం ప్రకారం.. బేబీ సినిమా తమిళ రీమేక్ కి సంబంధించి ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ సినిమా కోసం తమిళంలో హీరోహీరోయిన్స్ ఎంపిక కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే.. బేబీ తమిళ రీమేక్ కి కూడా డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా.. సాయి రాజేష్ బేబీ మూవీని చాలా హృద్యంగా తెరపై ఆవిష్కరించారు. పైగా ప్రస్తుత రోజుల్లో యూత్ లో లవ్ పై ఉన్న అభిప్రాయాలను, రెస్పెక్ట్ ని కూడా చక్కగా చూపించారు. మరి తమిళంలో హీరోహీరోయిన్స్ గా ఎవరు నటిస్తారో తెలియలేదు. కానీ.. డైరెక్టర్ మాత్రం ఆయనే అని టాక్. సో.. పూర్తి వివరాల కోసం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరి బేబీ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş