iDreamPost
android-app
ios-app

‘బేబీ’దర్శక, నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు!

  • Published Feb 10, 2024 | 11:51 AM Updated Updated Feb 10, 2024 | 11:51 AM

Baby Movie Makers: కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’మూవీ రుజువు చేసింది. ఈ మూవీపై సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

Baby Movie Makers: కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’మూవీ రుజువు చేసింది. ఈ మూవీపై సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

  • Published Feb 10, 2024 | 11:51 AMUpdated Feb 10, 2024 | 11:51 AM
‘బేబీ’దర్శక, నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు సత్తా చాటుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు దీటుగా సక్సెస్ సాధించి మంచి వసూళ్లు రాబడుతున్నాయి. సినిమా కంటెంట్ ఉంటే.. ఎలాంటి సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. అలాంటి సినిమాల్లో ఒకటి బేబీ. ఈ మూవీ నేటి తరం యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నది కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. రిలీజ్ అయినపుడు విమర్శలు వినిపించినా.. కంటెంట్ నచ్చడంతో జనాలు థియేటర్లకు ఎగబడ్డారు. ‘బేబీ’మూవీ గత ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఈ చిత్రంపై కొత్త వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

గతే ఏడాది సాయి రాజేశ్ దర్శకత్వంలో ఎస్‌కెఎన్ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీగా బేబీ మంచి సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా బేబీ మూవీ స్టోరీ నాదేనంటూ హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్. కొన్నేళ్ల క్రితం డైరెక్టర్ సాయి రాజేశ్ కి కథ చెప్పానని.. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. 2013లో తన మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయాలని డైరెక్టర్ సాయి రాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. ఆ విధంగా తమ మధ్య పరిచయం ఏర్పడిందని అన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ‘2015 లో ‘కన్నా ప్లీజ్’ టైటిల్ తో శిరన్ శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు ‘ప్రేమించొద్దు’ అని టైటిల్ పెట్టుకున్నాడు. గతంలో బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తో స్నేహం ఏర్పడింది.. ఈ క్రమంలోనే ఆయన సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (ఎస్‌కేఎన్) కి కథ చెప్పాడు. ఇదే కథను కొన్నాళ్ల తర్వాత 2023 లో ‘బేబీ’ టైటిల్ తో సినిమా తెరకెక్కించారు. ఈ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే.. ఎస్‌కేఎన్, దీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరించారు. బేబీ మూవీ తన స్టోరీ ‘ప్రేమించొద్దు’అని శ్రీరామ్ ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరి ఈ వివాదంసై బేబీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş