iDreamPost
android-app
ios-app

భారీ ధరకు అమ్ముడైన బేబీ ఓటీటీ రైట్స్‌.. ఎన్నికోట్లంటే..

  • Published Jul 15, 2023 | 8:20 AM Updated Updated Jul 15, 2023 | 8:20 AM
  • Published Jul 15, 2023 | 8:20 AMUpdated Jul 15, 2023 | 8:20 AM
భారీ ధరకు అమ్ముడైన బేబీ ఓటీటీ రైట్స్‌.. ఎన్నికోట్లంటే..

సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌ ఆనంద్‌లు జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముగ్గురి నటనకు సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా యూత్‌ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయిపోయారు. తమను తాము ప్రధాన పాత్రల్లో చూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఇక, బేబీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా బడ్జెట్‌ మొత్తం దాదాపు 10 కోట్ల రూపాయలు కాగా.. ఆహా పెద్ద మొత్తం పెట్టి సినిమాను కొన్నట్లు తెలుస్తోంది. అది కూడా 8 కోట్ల రూపాయలకు బేబీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు టాక్‌. అయితే, ఆహాలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. సినిమాకు మంచి టాక్‌ వచ్చిన నేపథ్యంలో కాస్త ఆలస్యంగానే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, బేబీ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ వైష్ణవి మాట్లాడుతూ.. దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. యూట్యూబ్‌లో చిన్న చిన్న క్యారెక్టర్లు కళ్లకు అద్దుకుని చేసుకునే తన లైఫ్‌లోకి సడెన్‌గా బేబీ సినిమా వచ్చిందన్నారు. తనపైన తనకు నమ్మకం లేని సమయంలో.. రాజేష్‌ నమ్మారన్నారు. తాను హీరోయిన్‌ అవుదామని వచ్చానని, చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఎస్‌కేఎన్‌ సార్‌ తనను ముందుకు నడిపించారన్నారు. తనను ఓ బేబీలాగా చూసుకున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetovis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş