iDreamPost
android-app
ios-app

Keerthy Suresh: మహానటి మూవీకి కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్ అనుకున్నా.. ఎందుకంటే?: అవసరాల శ్రీనివాస్

  • Published Mar 18, 2024 | 4:20 PM Updated Updated Mar 18, 2024 | 4:20 PM

మహానటి మూవీలో సావిత్రి పాత్రకోసం కీర్తి సురేష్ ను తీసుకోవడం రాంగ్ ఛాయిస్ గా భావించానని నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా అనుకోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాడు. మరి ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం.

మహానటి మూవీలో సావిత్రి పాత్రకోసం కీర్తి సురేష్ ను తీసుకోవడం రాంగ్ ఛాయిస్ గా భావించానని నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా అనుకోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాడు. మరి ఆ రీజన్ ఏంటో తెలుసుకుందాం.

  • Published Mar 18, 2024 | 4:20 PMUpdated Mar 18, 2024 | 4:20 PM
Keerthy Suresh: మహానటి మూవీకి కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్ అనుకున్నా.. ఎందుకంటే?: అవసరాల శ్రీనివాస్

ఇండస్ట్రీలో కొందరు నటీ, నటులు చేసిన పాత్రలు వారికోసమే సృష్టించారేమో అన్నంతగా ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అనుష్క పోషించిన అరుంధతి పాత్ర ఆమె తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అన్నంతగా నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా మహానటి మూవీలో సావిత్రి పాత్రను పోషించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. అయితే ఈ పాత్రకోసం కీర్తి సురేష్ ను తీసుకోవడం రాంగ్ ఛాయిస్ గా భావించానని నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా అనుకోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాడు.

కీర్తి సురేష్.. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క మహానటి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటిస్తోంది. ఇక కీర్తి కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే మహానటి మూవీకి ముందు, ఆ తర్వాత అని మాట్లాడుకోవాలి. సావిత్ర బయోపిక్ అయిన మహానటి మూవీలో లీడ్ రోల్ లో యాక్ట్ చేసి ప్రశంసలు పొందింది కీర్తి సురేష్. ఇక ఈ మూవీలో ఎల్వీ ప్రసాద్ రోల్ కు డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన అవసరాల శ్రీనివాస్ ను నాగ్ అశ్విన్ సంప్రదించినప్పుడు వెంటనే చేస్తానని ఒప్పుకున్నాడట. ఈ క్రమంలో సావిత్ర పాత్రకు కీర్తి సురేష్ ను తీసుకున్నామని చెప్పాడట నాగ్ అశ్విన్. దీంతో మహానటి సావిత్రి పాత్రకు ఆమెను తీసుకోవడం ఏంటి? ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది కదా? ఫేస్ లో దుఃఖం, ఇతర ఎమెషన్స్ పలికించగలదా? అన్న సందేహం కలిగిందట.

Avasarala sreenivas about mahanati keerthy suresh character

దీంతో ఆమెను ఈ పాత్రకు కీర్తిని సెలెక్ట్ చేయడం రాంగ్ ఛాయిస్ గా భావించానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అవసరాల శ్రీనివాస్. అయితే.. సినిమా విడుదలైన తర్వాత తన ఒపీనియన్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చాడు. సావిత్ర పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతమని తెలిపాడు. ఇక అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం పలు సీనిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ మూవీలో కీలక పాత్ర పోషించి, మంచి మార్కులు కొట్టేశాడు. కీర్తి సురేష్ తమిళంలో బిజీగా ఉంది.

ఇదికూడా చదవండి: Hanuman Movie: థియేటర్ లో హనుమాన్ సూపర్ హిట్.. OTTలో మాత్రం నెగిటివిటి!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş