ఆగస్టులో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ ఇవే.. మూవీ లవర్స్ కు పండగే

ఆగస్టులో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ ఇవే.. మూవీ లవర్స్ కు పండగే

మొన్న మొన్నటి వరకు ప్రభాస్ కల్కి సినిమాతో థియేటర్స్ కలకలలాడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతానికి కల్కి సినిమా థియేటర్స్ లో రన్ అవతుండగా.. మరి కొన్ని రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. అయితే ఈ ఆగస్టు నెలలో సినీ ప్రేక్షకులకు సినిమాల జాతరనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఆగస్టు నెలలో భారీ సినిమాలతో పాటు రీరిలీజ్ సినిమాలు పోటీ పడనున్నాయి. ఇంతకి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

మొన్న మొన్నటి వరకు ప్రభాస్ కల్కి సినిమాతో థియేటర్స్ కలకలలాడిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతానికి కల్కి సినిమా థియేటర్స్ లో రన్ అవతుండగా.. మరి కొన్ని రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. అయితే ఈ ఆగస్టు నెలలో సినీ ప్రేక్షకులకు సినిమాల జాతరనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ ఆగస్టు నెలలో భారీ సినిమాలతో పాటు రీరిలీజ్ సినిమాలు పోటీ పడనున్నాయి. ఇంతకి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఈ ఏడాది సినిమాల జాతర అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈసారి సంక్రాతి బరిలోకి స్టార్ హీరోల సినిమాలతో థియేటర్స్ కలకలలాడాయి. ఇక వాటిలో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ ఇలా అన్ని పెద్ద సినిమాలతో ఈ ఏడాదిని ఘనంగా వెల్కమ్ చెప్పారు. అంతేకాకుండా.. ఈ సినిమాలకు థియేటిరికల్ కలెక్షన్స్ కూడా రికార్డ్ ను సృష్టించాయి. దీంతో ప్రేక్షకులకు మంచి సినిమాలతో పండగ వాతవరణం నెలకొంది. ఇకపోతే మధ్యలో సమ్మర్ కాస్త బోరింగ్ అనిపించినా.. దానిని కొంత మేరకు కవర్ చేసేలా.. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో కాస్త ప్రేక్షకులకు హుషారు తెప్పించాడు. ఇకపోతే సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర వాయిదా పడటంతో ప్రేక్షకులు నిరాశే మిగిలింది. దీంతో సమ్మర్ మొత్తం థియేటర్స్ లో పెద్ద సినిమాలు లేక చప్పగా సాగింది.

అయితే ఈ ఎఫెక్ట్ నుంచి ప్రేక్షకులకు బూస్టప్ అందించేందుకు జూన్ లో ప్రేక్షకులు, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రం జూన్ 27న విడుదలైంది. దీంతో కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. థియేటర్స్ కూడా కాస్త ఊపొచ్చింది. ముఖ్యంగా సింగల్ స్క్రీన్స్ దగ్గర నుంచి మల్టిప్లెక్స్ స్క్రీన్స్ వరకు ప్రేక్షకులతో హోస్ పుల్ అవ్వడంతో పాటు కలెక్షన్స్ వర్షం కురిపించింది. అయితే మొన్న మొన్నటి వరకు థియేటర్స్ లో కల్కి సినిమా ప్రభంసనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు కాస్త ఆ కళ తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇలా కొన్ని రోజులు కల్కి థియేటర్స్ లో కొనసాగుతుండగానే.. ఆగస్టు నెల ప్రారంభం కానుంది.

ఇక ఈ ఆగస్టు నెల వస్తే మళ్లీ థియేటర్స్ కు పూర్వ వైభవం వస్తుంది. ఎందుకంటే.. ఈ ఆగస్టు నెలలో ఓ వైపు భారీ సినిమాలతో పాటు మరో వైపు స్టార్ హీరోలా రీరిలీజ్ సినిమాలు పోటీ పడుతున్నయి.ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు, రీరిలిజ్ కావాల్సిన సినిమాలు జోరు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకి రిలీజ్, రీరిలిజ్ సినిమాల జాతర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలీజ్‌లు-రీరిలీజ్‌ల మధ్య పోటీ

వచ్చే నెల ఆగస్టులో ముందుగా రీరిలీజ్ సినిమాలతో థియేటర్స్ సందడి చేయనున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా.. ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘ఒక్కడు’ సినిమాను ఒక్కరోజు ముందే స్పెషల్ షో వేయబోతున్నారు. ఇక అనంతరం ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు క్లాసిక్ మూవీ ‘మురారి’ రీరిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే మురారి సినిమా రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా హంగామా మొదలైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా చాలామంది మహేష్ అభిమానులు పెళ్లి పత్రికల రూపంలో ప్రమోషన్స్ చేస్తూ భలే సందడి చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసిన మురారి సినిమా సందడే ఎక్కువగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. అక్కడకు ఓ వారం రోజుల తర్వాత ఎనర్జిటిక్ రామ్ పోతినేని,పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రిలీజ్ కానుంది. కాగా,ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్‌కి రీమేక్‌గా థియేటర్ లో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్ష్కులకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అదే రోజున థియేటర్ లో మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా విడుదల కానుంది. డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రిలీజ్ కాబోతుంది. కాగా,ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు ఈ ఆగస్టు 15న పలు భాషల్లో మరో 8 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ఇక అదే నెల అదే వారంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా..  ‘ఇంద్ర’ సినిమాను ఆగస్టు 22వ తేదీన గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆగస్టు నెల చివరికి నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ సినిమాతో సందడి చేయబోతున్నారు. ఇక సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఇదే రోజు కింగ్ నాగార్జున-రామ్ గోపాల్ వర్మ సూపర్ హిట్ మూవీ ‘శివ’ రీరిలీజ్ కానుంది. ఇలా మొత్తానికి  ఆగస్టు నెల మొత్తం టాలీవుడ్ లో రిలీజ్, రీరిలీజ్ సినిమాలతో ప్రేక్షకులకు పండగ వాతవరణం మొదలవుతుంది. మరీ, ఈ సినిమాల్లో మీకు ఆసక్తి కలిగించిన సినిమా ఏదో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments