ఏషియన్ ఫిలిమ్స్ మాస్టర్ ప్లాన్! హీరోలతో బిజినెస్ ఎలా చేస్తున్నారు?

టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ రంగంలో హీరోలతో ఏషియన్ సినిమాస్ తన మాస్టర్ ప్లాన్ తో ఎలా వ్యాపారం చేయిస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ రంగంలో హీరోలతో ఏషియన్ సినిమాస్ తన మాస్టర్ ప్లాన్ తో ఎలా వ్యాపారం చేయిస్తుందో ఓసారి పరిశీలిద్దాం.

‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ ఈ సామెత సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓ మూవీకి భారీ లాభాలు వస్తే.. మరో సినిమాకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థులు కూడా వస్తాయి. ఇలాంటి ఘటను మనం పరిశ్రమలో చాలానే చూశాం. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బిజినెస్ లు స్టార్ట్ చేస్తూ.. దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ హవా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు మల్టీప్లెక్స్ రంగంలోకి దిగారు. అయితే వీరందరి వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. దాని పేరే ‘ఏషియన్ ఫిల్మ్స్’. ఈ సంస్థ స్టార్ హీరోలతో బిజినెస్ ఎలా చేయిస్తున్నారో ఇప్పుడు పరిశీలిద్దాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు AMB సినిమాస్, అల్లు అర్జున్ AAA సినిమాస్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ AVD సినిమాస్ తో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే బాటలోకి రాబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ART పేరుతో 6 స్క్రీన్లతో దిల్ సుఖ్ నగర్ లో ఓ భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించనున్నారు. అయితే ఈ స్టార్ హీరోలందరి బిజినెస్ ల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. ఆ మాస్టర్ మైండ్ పేరు ఏషియన్ ఫిల్మ్స్. ఈ సంస్థ అధిపతి సునీల్ నారంగ్.

తన వ్యాపార దృక్ఫథంతో, ముందుచూపుతో.. మల్టీప్లెక్స్ థియేటర్ల సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు సునీల్ నారంగ్. అందులో హీరోలను భాగం చేసి.. తిరుగులేని విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. స్టార్ హీరోలను ఈ బిజినెస్ లో భాగస్వామ్యం చేయడంతో.. వారి స్టార్ డమ్, ఫ్యాన్ బేస్ లాంటివి ఈ బిజినెస్ కు అండగా నిలుస్తూ వస్తున్నాయి. హీరోలకు ఉన్న ఇమేజే ఈ బిజినెస్ కు పెద్ద పెట్టుబడి. స్టార్స్ సైతం తమకు ఉన్న క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో పెట్టుబడిగా 30 శాతం నుంచి 40 శాతం వరకు హీరోలు ఇన్వెస్ట్ చేస్తే.. మిగతా భాగం ఏషియన్ సినిమాస్ సంస్థ పెట్టుబడి కింద పెడుతోందట. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఈ పెట్టుబడిని 50 శాతానికి పెపొందించేందుకు ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదుర్చుకుంటారని తెలుస్తోంది.

కాగా.. ఈ బిజినెస్ లో ఎలాంటి నష్టం వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే? పెట్టుబడి పెట్టేది హీరోలే కాబట్టి.. వారి సినిమాలు రిలీజ్ అయితే క్రేజ్ తో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగొందుతుంది. ఇదే ఆలోచించిన ఏషియన్ సినిమాస్ సంస్థ అధినేత తన మాస్టర్ ప్లాన్ తో ఈ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పుడు రవితేజ ప్రారంభించబోయే ART థియేటర్ లో కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్ నర్ షిప్ ఉంది. మరి స్టార్ హీరోలతో వ్యాపారం చేయిస్తూ.. ముందుకెళ్తున్న ఏషియన్ సినిమాస్ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: షణ్ముఖ్ కేసులో సంచలన ట్విస్ట్! కన్న తండ్రే పట్టించాడా?

Show comments