iDreamPost
android-app
ios-app

Ashu Reddy: డ్రగ్స్ కేసు ఆరోపణలపై అషూరెడ్డి సీరియస్.. పరువు నష్టం దావా వేస్తానంటూ..!

Ashu Reddy: డ్రగ్స్ కేసు ఆరోపణలపై అషూరెడ్డి సీరియస్.. పరువు నష్టం దావా వేస్తానంటూ..!

టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న డ్రగ్స్ కేసుపై మరోసారి బుల్లితెర నటి అషూరెడ్డి స్పందించింది. ఈ నెల 14న కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో అషూరెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. అప్పుడే ఇన్ స్టాగ్రామ్ పోస్టు ద్వారా అషూరెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈసారి నేరుగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తనకు ఎలాంటి సబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేసింది.

“రెండ్రోజులుగా ఒక కేసు గురించి నా పేరును వాడుతున్నారు. కేసులో నా పేరు ఉందని నిజా నిజాలు తెలుసుకోకుండా నా పేరు, నా నంబర్ ను డిస్ ప్లే చేస్తూ కొన్ని ఛానల్స్ ప్రచారం చేసింది. నా కాల్ లిస్ట్ నా దగ్గర ఉంది. ఇలాంటి సమయంలో నేను ఇలా స్పందిచకపోతే కరెక్ట్ కాదు. ఎవరైతే నా నంబర్, నా పేరును డీఫేమ్ చేస్తూ రాశారో అందరిపై డెఫమేషన్ కేసు ఫైల్ చేస్తాను. వందల కాల్స్, గంటల తరబడి ఫోన్ మాట్లాడని చెప్పారు. నా దగ్గర అన్ని ప్రూవ్స్ వాళ్లు అలా నా నంబర్ డిస్ ప్లే చేయడం వల్ల.. నాకు రెండ్రోజులుగా ప్రతి సెకనుకు ఒక ఫోన్ కాల్ వస్తోంది. ఎవరినీ నేను వదలను కేసు ఫైల్ చేస్తాను” అంటూ అషూరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఈ కేసు విషయంలో ప్రముఖ నటులు సురేఖా వాణి, జ్యోతి కూడా స్పందించారు. తమకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి ప్రచారాల వల్ల తమ పేరు, అవకాశాలు, కెరీర్ దెబ్బతింటాయంటూ వాపోయారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరిని పోలీసులు ఈ నెల 14న అరెస్టు చేశారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అతని వద్ద కొకైన్ కొన్నవాళ్ల జాబితా గూగుల్ డ్రైవ్ లో దొరికింది అన్నారు. అతని వద్దనున్న 4 సెల్ ఫోన్స్ లో వందల మంది ప్రముఖుల ఫోన్ నంబర్స్ ఉన్నాయి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet