Swetha
Choreographer Jani master -Remand Report: తాజాగా జానీ మాస్టర్ కేసులో మరొక సంచలనం విషయం బయటపడింది. తానూ న్యాయ పరంగానే తేల్చుకుని నిజాయితీగా బయటకు వస్తానన్న జానీ మాస్టర్ మాటలు అబద్దాలని ప్రూవ్ అయ్యాయి. రిమాండ్ రిపోర్ట్ లో అసలు నిజాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Choreographer Jani master -Remand Report: తాజాగా జానీ మాస్టర్ కేసులో మరొక సంచలనం విషయం బయటపడింది. తానూ న్యాయ పరంగానే తేల్చుకుని నిజాయితీగా బయటకు వస్తానన్న జానీ మాస్టర్ మాటలు అబద్దాలని ప్రూవ్ అయ్యాయి. రిమాండ్ రిపోర్ట్ లో అసలు నిజాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో రోజుకు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తానూ మైనర్ గా ఉన్నప్పటినుంచి జానీ మాస్టర్ తనని వేధిస్తున్నాడంటూ.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్.. ఇండస్ట్రీ వర్గాలను కదిపింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఈ కేసు విషయంలో కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ కూడా మీడియాతో మాట్లాడి.. తానూ ఏ తప్పు చేయలేదని.. నిజాయితీగా బయటకు వస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత.. ఏం జరుగుతుందా అనే సందేహాలు అందరిలో తలెత్తాయి. ఈ కేసు విషయంలో నిజ నిజాలు తెలియడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందా అని అందరు అనుకున్నారు. కానీ ఇంతలోనే రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. జానీ మాస్టర్ తన తప్పును ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. తనపైన ఉన్న దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని అసిస్టెంట్ గా జాయిన్ చేసుకున్నట్లు.. అలాగే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటినుంచి కూడా తనను లైంగికంగా వేధించినట్లు రిమాండ్ రిపోర్ట్స్ లో స్పష్టం అయినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక కన్ఫర్మ్ అయితే.. జానీ మాస్టర్ కు కోర్టు ఎన్ని ఏళ్ళ శిక్షను విధించనుందో కూడా తెలియాల్సి ఉంది.
మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో అమ్మాయికి అనుకూలంగానే ఆధారాలు ఉంటూ ఉన్నాయి. కానీ సడెన్ గా మీడియాతో జానీ మాస్టర్ మాట్లాడిన తర్వాత.. ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. దీనితో జానీ మాస్టర్ చెప్పే దానిలో కూడా నిజాలు లేకపోలేదని కొందరు అనుకున్నారు. కానీ జానీ మాస్టర్ మాట్లాడిన కొద్దీ గంటల్లోనే రిమాండ్ రిపోర్ట్స్ ఆధారంగా.. తప్పు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంత నమ్మకంగా తానూ ఏ తప్పు చేయాలేదని.. ఎవరో తనపై కుట్ర పన్నారని.. న్యాయపరంగానే బయటకు వస్తానన్న జానీ మాస్టర్ నీతి మాటలు ఏమైనట్లు. కొద్దీ గంటల్లోనే తన తప్పును ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఎందుకు బయటకు వచ్చినట్లు? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రతి గంటకు కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసు విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.