iDreamPost
android-app
ios-app

అరవింద్ స్వామి అసలు తండ్రి నేనే.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు!

  • Author ajaykrishna Updated - 03:30 PM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 03:30 PM, Mon - 11 September 23
అరవింద్ స్వామి అసలు తండ్రి నేనే.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ నటుడు, హీరో అరవింద్ స్వామి గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన దళపతి, రోజా, బొంబాయి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 90స్ లో అరవింద్ స్వామి అంటే.. తెలుగు ప్రేక్షకులలో.. ముఖ్యంగా లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. హీరో అయ్యాక కేవలం తమిళ భాషకే పరిమితం కాకుండా అవకాశాలు వచ్చిన ప్రతీ భాషలో తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ళుగా విలన్ రోల్స్ చేస్తూ.. లైఫ్ లో మరో ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే.. ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్నప్పటికీ.. అరవింద్ స్వామి తన పర్సనల్ లైఫ్ ని చాలా గోప్యంగా ఉంచుతాడు.

తన ఫ్యామిలీని మీడియాకి, ఇండస్ట్రీకి దూరంగా మెయింటైన్ చేస్తున్నాడు. అదిగాక అరవింద్ స్వామి గురించి ఎప్పుడు కూడా మీడియాలో వ్యక్తిగత జీవితం గురించి చర్చలు జరగలేదు. అలాంటిది సడన్ గా కోలీవుడ్ కి చెందిన సీనియర్ నటుడు.. అరవింద్ స్వామికి అసలు తండ్రిని నేనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అవుతున్నారు. దీంతో అరవింద్ స్వామి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో ట్రెండ్ అవుతోంది. తమిళ నటుడు ఢిల్లీ కుమార్.. అరవింద్ స్వామి తన సొంత కొడుకు అని.. కానీ, తమ మధ్య తండ్రీకొడుకుల బంధం లేదని రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇంతకీ ఢిల్లీ కుమార్ ఏమన్నారంటే.. “అరవింద్ నా సొంత కొడుకు. అతన్ని చిన్నతనంలో నా చెల్లి దత్తత తీసుకుంది. అక్కడే పెరిగాడు. ఏవైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తప్ప పెద్దగా ఇంటికి వచ్చేవాడు కాదు. మేం తండ్రీకొడుకులమే గానీ.. మా మధ్య అలాంటి బంధం ఏర్పడలేదు. నిజం చెప్పాలంటే మేమిద్దరం కలిసి దిగాం అనడానికి ఒక్క ఫోటో కూడా లేదు. ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నా కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.” అని చెప్పుకొచ్చాడు. అయితే.. అరవింద్ స్వామి తన కెరీర్ ఆరంభంలోనే తన తండ్రి ఢిల్లీ కుమార్ అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ అరవింద్ ఆయన ఊసు ఎక్కడ తీయలేదు. అరవింద్ స్వామికి పేరెంట్స్ అంటే.. వెంకటరమణ దొరైస్వామి, వసంత పేర్లే అందరికి తెలుసు. సో.. ఇప్పుడు ఢిల్లీ కుమార్ వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయంశంగా మారాయి. మరి అరవింద్ స్వామి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి