iDreamPost
android-app
ios-app

అరి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. టాలీవుడ్‌లో ఇది మరో ప్రయోగమే!

  • Published Jul 18, 2024 | 6:26 PM Updated Updated Jul 18, 2024 | 6:26 PM

బుల్లితెర నుండి వెండితెరపై ఉవ్వెత్తున ఎగసి పడిన అందం అనసూయ భరద్వాజ్. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, పుష్ప 2 పాన్ ఇండియా మూవీతో పాటు మరో చిత్రం కూడా ఉంది.

బుల్లితెర నుండి వెండితెరపై ఉవ్వెత్తున ఎగసి పడిన అందం అనసూయ భరద్వాజ్. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, పుష్ప 2 పాన్ ఇండియా మూవీతో పాటు మరో చిత్రం కూడా ఉంది.

  • Published Jul 18, 2024 | 6:26 PMUpdated Jul 18, 2024 | 6:26 PM
అరి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్.. టాలీవుడ్‌లో ఇది మరో ప్రయోగమే!

స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న బ్యూటీ అనసూయ భరద్వాజ్. న్యూస్ యాంకర్, జబర్దస్త్ షో నుండి బుల్లితెరపై అలరించిన ఈ బ్యూటీ.. సోగ్గాడే చిన్ని నాయనాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ అనతికాలంలో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. రంగస్థలం మూవీలో రంగమత్తగా అందరి మనస్సులను దోచేసుకుంది. పుష్పలో దాక్షాయణిగా ఆమె వేరే లెవల్ యాక్టింగ్. ఈ మూవీతో పాన్ ఇండియన్ గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. భీమా పర్వం మూవీతో మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది అను. ప్రస్తుతం పుష్ప2తో పాటు రెండు తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇవే కాకుండా మరో మూవీలో నటిస్తోంది అనసూయ. అరి అనే ప్రయోగాత్మక చిత్రంలో యాక్ట్ చేసింది . మైనేమ్ ఈజ్ నోబడీ ఉపశీర్షిక. ఏడాది క్రితమే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఓ లైబ్రరీ చుట్టూ కథ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను ఆధారంగా చేసుకుని అరి అనే మూవీ తెరకెక్కుతుంది. అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి, ప్రకృతి వినాశనానికి ఇవి కారణమవుతాయి. దీన్నే కథాంశంగా తీసుకుని మూవీ తెరకెక్కిస్తున్నారు. ఆర్వీవీ బ్యానర్ పై శ్రీనివాస రామిరెడ్డి, పురిమెట్ల తిమ్మప్ప నాయుడు, శేషు మారం రెడ్డి నిర్మిస్తున్నారు. అనురూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మంగ్లీ ఆలపించిన ఫస్ట్ సాంగ్ గత ఏడాదే రిలీజైంది.

పేపర్ బాయ్ ఫేం వి. జయశంకర్ ఈ మూవీకి దర్శకుడు. ఇప్పుడు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాల ఎవర్ ఏ క్యారెక్టర్ పోషిస్తున్నారో ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇందులో అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్,హర్ష, చమ్మక్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సురభి పద్మావతి,  కేశవ్ దీపక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇందులో అనసూయ జెలస్, సాయికుమార్ అహంకారం (ప్రైడ్), హర్ష జెముడు లస్ట్ (కామం), శుభలేక సుధాకర్ (గ్రీడీ), శ్రీకాంత్(కోపం) అంటూ క్యారెక్టర్స్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. చివరిలో ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్ కనిపించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ మూవీ కూడా మైథాలజీ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio