iDreamPost
android-app
ios-app

నాకు 10 కోట్ల పరిహారం చెల్లించండి! అసోసియేషన్ కు AR రెహమాన్ నోటీసులు

  • Author Soma Sekhar Updated - 12:02 PM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 12:02 PM, Fri - 3 November 23
నాకు 10 కోట్ల పరిహారం చెల్లించండి! అసోసియేషన్ కు AR రెహమాన్ నోటీసులు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. దానికి కారణం సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏఆర్ రెహమాన్ మధ్య కొనసాగుతున్న వివాదమే. ఈ వివాదంలో భాగంగా సర్జన్స్ అసోసియేషన్ పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు రెహమాన్. 2018లో మెుదలైన ఈ వివాదం గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఏఆర్ రెహమాన్ 2018లో చెన్నైలో ఒక కచేరీ నిర్వహించారు. కానీ ప్రభుత్వం ఈ మ్యూజిక్ కన్సర్ట్ కు అనుమతి ఇవ్వకపోవడంతో.. మధ్యలోనే కచేరీని ఆపేశారు. ఇక ఈవెంట్ కోసం రెహమాన్ కు రూ. 29.50 లక్షల డబ్బును ఇచ్చినట్లు అసోసియేషన్ తెలిపింది. ఈవెంట్ నిర్వహించకపోవడంతో.. డబ్బులు తిరిగి చెల్లించమని రెహమాన్ ను కోరింది. దీంతో రెహమాన్ వారికి ముందస్తు డేట్ ఉన్న చెక్ ను అందించాడు. కానీ ఆ అకౌంట్ లో డబ్బులు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది.

ఈ విషయంపై అసోసియేషన్ రెహమాన్ పై చర్యలు తీసుకోవాలని చెన్నై మెట్రోపాలిటన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి.. నోటీసులు కూడా పంపింది. ఈ నోటీసులపై తన లాయర్ ద్వారా స్పందించాడు రెహమాన్. సదరు అసోసియేషన్ కు రిప్లై నోటీసులు పంపిస్తూ.. రెహమాన్ కు సంబంధంలేని మూడో వ్యక్తికి డబ్బులు ఇచ్చారని, ఇందులో రెహమాన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఆయన పరువుకు భంగం కలిగించే ప్రక్రియే అని రిప్లై నోటీసులు పంపుతూ.. తమకు పంపిన నోటీసులను 3 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఇక రెహమాన్ ప్రతిష్టకు భంగం వాటిల్లినందుకు గాను.. రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, లేనిచో చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసులో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.