Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ కమెడియన్ హైపర్ ఆదిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై.. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆది కామెంట్లు చేయటాన్ని వారు తప్పుబట్టారు. తాజాగా, ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై హైపర్ ఆది తీరుపై ఏపీ ప్రజల్ని ప్రశ్నించగా… ‘‘ అతడికి మాట్లాడటం చాలా ఈజీ. భగవంతుడు ఒక్కోరికి ఒక్కో వరం ఇస్తాడు. హైపర్ ఆదికి మాట్లాడే వరం ఇచ్చాడు దేవుడు. నాలుక మీద నుంచి మాటలు దన్‌మని వస్తాయి. దాంట్లో భాగంగా ఆయన నాలుక ఎక్కడ మెలిక తిరిగిద్దో తెలియని పరిస్థితి.
కనీసం ఒక కార్పోరేటర్ అయి పాలించినా.. ఓ రెండు, మూడు వేల ప్రజల సార్థక బాధలు తెలుస్తాయి. నాలుక మీద మాటలది ఏముందండి. జబర్థస్త్‌లో జోకులు వేసినట్లు వేసేసి. అట్టాగే రాజకీయ నాయకుల మీద కూడా చూపిస్తుంటది. అది సంస్కారం అనిపించుకోదు. అది అట్లాగే తప్ప మేరేది లేదు’’ అని అన్నారు. అంబటి రాంబాబు విషయంలో జనసేన తీరును కూడా ప్రజలు తప్పుబట్టారు. అది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేసిందన్నారు. వేరే ఇదేం లేదని తెలిపారు.
ముఖ్యుల్ని బద్నాం చేయటానికి చూస్తున్నారని తెలిపారు. వేరే ఉద్ధేశ్యం లేదని కూడా అన్నారు. ఈ సారి కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆయన మీద ఆప్యాయతా అనురాగాలు ఉన్నాయన్నారు. సీఎం జగన్ తీసుకువచ్చిన పథకాలే ఆయనకు శ్రీరామ రక్ష అవుతాయని తెలిపారు. ప్రజలు సైలెంట్‌గా ఉంటారని, బడుగు బలహీన వర్గాలే సీఎం జగన్‌కు ఆయువు పట్టు అని తెలిపారు. మరి, హైపర్ ఆదిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.