iDreamPost
android-app
ios-app

OG జిఓ కాస్త సంతోషమే కానీ !

  • Published Sep 18, 2025 | 12:22 PM Updated Updated Sep 18, 2025 | 12:22 PM

ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజికి సంబందించిన జిఓ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో టికెట్ రేట్లు , బెనిఫిట్ షోస్ గురించి క్లారిటీ ఇచ్చారు. ముందైతే 24 నే ప్రీమియర్స్ ఉంటాయని అన్నారు. కానీ ఆ తర్వాత వీటిని క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. ఇక నిన్న రిలీజ్ చేసిన జిఓ విషయానికొస్తే..

ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజికి సంబందించిన జిఓ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో టికెట్ రేట్లు , బెనిఫిట్ షోస్ గురించి క్లారిటీ ఇచ్చారు. ముందైతే 24 నే ప్రీమియర్స్ ఉంటాయని అన్నారు. కానీ ఆ తర్వాత వీటిని క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. ఇక నిన్న రిలీజ్ చేసిన జిఓ విషయానికొస్తే..

  • Published Sep 18, 2025 | 12:22 PMUpdated Sep 18, 2025 | 12:22 PM
OG జిఓ కాస్త సంతోషమే కానీ !

ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమా ఓజికి సంబందించిన జిఓ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో టికెట్ రేట్లు , బెనిఫిట్ షోస్ గురించి క్లారిటీ ఇచ్చారు. ముందైతే 24 నే ప్రీమియర్స్ ఉంటాయని అన్నారు. కానీ ఆ తర్వాత వీటిని క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. ఇక నిన్న రిలీజ్ చేసిన జిఓ విషయానికొస్తే.. అర్ధరాత్రి 1 గంట నుంచి షోస్ కు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ షోస్ కు వెయ్యి రూపాయల టికెట్ రేట్ ను ఫిక్స్ చేసింది. ఇంతవరకు అంతా హ్యాపీ గానే ఉన్నారు. కాస్ట్ ఎంతైనా వీరాభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే ఇక్కడ ఇంకో నిరాశ ఎదురుకాబోతుంది. మొదటి రోజు కేవలం ఐదు షో లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎందుకంటే స్పెషల్ షో తర్వాత 7 గంటలకు ఓ ఆట వేస్తే నైట్ ఒకటి ఆపేయాల్సి వస్తుంది. ఒకవేళ ఉదయం 7 గంటల షో ఆపేసి డైరెక్ట్ గా 10-11 వేస్తే మాత్రం సినిమా మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే సుమారు అయిదారు గంటల గ్యాప్ వస్తుంది. ఈలోపే సోషల్ మీడియా మూవీ టాక్ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అది నెగెటివ్ అయినా పాజిటివ్ అయినా ఎలా అయినా ఆ దెబ్బ సినిమా మీద పడుతుంది. దీనితో మూవీ లవర్స్ , ఫ్యాన్స్ కొత్త జిఓ కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతానికైతే మొదటి షో ల విషయం ఇలా ఉంది. దీనికి సంబంధించి ఏమైనా సవరణలు తీసుకుంటారో లేదో చూడాలి. అలాగే మొదటి పది రోజులు టికెట్ రేట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి.. సినిమా టాక్ హైప్ కి రీచ్ అయ్యేలా ఉంటె కచ్చితంగా టాప్ రికార్డ్స్ ను టచ్ చేయగలదని చెప్పొచ్చు. ఒకవేళ అదే కనుక అయితే రికార్డ్స్ పరంగా కాస్త వెనుకంజలో ఉన్నాడు పవన్ అనే ట్యాగ్ లైన్ కూడా పోతుంది. ఇక అంతా సుజీత్ మీదే ఆధారపడి ఉంది. ఈ ఫ్యాన్ బాయ్ ఎలాంటి విధ్వసం సృష్టిస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.