iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో భోళా శంకర్ మూవీకి షాక్!

  • Author Soma Sekhar Published - 06:58 PM, Wed - 9 August 23
  • Author Soma Sekhar Published - 06:58 PM, Wed - 9 August 23
ఆ విషయంలో భోళా శంకర్ మూవీకి షాక్!

సాధారణంగా ఇండస్ట్రీలో పెద్ద హీరో సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే. ఇక అదికూడా మెగాస్టార్ సినిమా అయితే.. ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా ఫ్యాన్స్ జాతర చేసుకుంటారు. వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ నుంచి రాబోతున్న చిత్రం భోళా శంకర్. స్టైలిష్ డైరెక్టర్ గా పేరున్న మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 11న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా.. ఈ టైమ్ లో భోళా శంకర్ కు ఊహించని షాక్ తగిలింది.

భోళా శంకర్.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కించగా.. ఏకే ఎంటర్ టైన్ మెంట్ పై నిర్మాత రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది భోళా శంకర్. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించాడు మెగాస్టార్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇలాంటి టైమ్ లో భోళా శంకర్ మూవీ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మూవీ టీమ్ కు ఇంకా అనుమతి లభించలేదు.

ఈ క్రమంలోనే టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని భోళా శంకర్ మూవీ యూనిట్ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యూమెంట్లను జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు ఈ దరఖాస్తును తిరస్కరించాయి. దీంతో మరో రెండు రోజుల్లో మూవీ రిలీజ్ ఉండగా.. ఇలాంటి షాక్ తగులుతుందని మూవీ యూనిట్ ఊహించి ఉండదు. కాగా.. స్టార్ హీరోల సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రభుత్వాలను కోరడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితి. గతంలో కూడా స్టార్ హీరోల సినిమాల టికెట్ల రేట్లు పెంచుకుంటాం అని అభ్యర్థించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మరి భోళా శంకర్ మూవీకి తగిలిన షాక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ఘనంగా బుల్లితెర నటి లహరి సీమంతం! వైరల్ ఫొటోలు

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet