iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో వెంటనే సినిమా చేయాలి! కానీ, ఆ ఒక్కటే ప్రాబ్లెమ్: అనుష్క

  • Author ajaykrishna Updated - 11:04 AM, Wed - 6 September 23
  • Author ajaykrishna Updated - 11:04 AM, Wed - 6 September 23
ప్రభాస్ తో వెంటనే సినిమా చేయాలి! కానీ, ఆ ఒక్కటే ప్రాబ్లెమ్: అనుష్క

ఇండస్ట్రీలో స్టార్ పెయిర్స్ కి ఉండే క్రేజ్ వేరు. వాళ్ళు రీల్ జంట అయినా.. రియల్ గా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకునే ఫ్యాన్స్ ఉంటారు. టాలీవుడ్ లో అలాంటి ఫ్యాన్స్ బేస్ ఉన్న జంట.. డార్లింగ్ ప్రభాస్ – అనుష్క. వీరి జంట తెరపై ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. దాదాపు నాలుగు సూపర్ హిట్ సినిమాలు చేసి.. ప్రేక్షకుల హృదయాలలో బెస్ట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. వీరి కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా చూసి ఆదరించడానికి ఎప్పుడైనా ఫ్యాన్స్ రెడీనే. కానీ.. కలిసి సినిమాలు చేయడం కాదు కదా! కనీసం కలిసి కనిపించడం లేదని వాపోతున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. ముఖ్యంగా బాహుబలి సిరీస్ తో వీరి క్రేజ్ పాన్ ఇండియా దాటి.. వరల్డ్ వైడ్ విస్తరించింది. కానీ.. 2017లో విడుదలైన బాహుబలి 2 తర్వాత.. ఇప్పటిదాకా మళ్లీ వీరి కాంబోలో కొత్త సినిమా రాలేదు. కనీసం చర్చలు జరిగిన దాఖలాలు కూడా లేవు. అయితే.. బాహుబలి తర్వాత ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. సలార్.. కల్కి లాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ.. అనుష్క మాత్రం 2020 వచ్చిన నిశ్శబ్దం మూవీ తర్వాత.. ఏ సినిమా చేయలేదు.

ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చేసింది. ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. సెప్టెంబర్ 7న మూవీ రిలీజ్ అవుతోంది. కాగా.. సినిమా ప్రమోషన్స్ లో పెద్దగా కనిపించని అనుష్క.. ఓ ఇంటర్వ్యూలో మాత్రం పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు? అనే విషయంపై స్పందించింది. అనుష్క మాట్లాడుతూ.. “ప్రభాస్ తో సినిమా చేసేయాలని ఉంది. కానీ.. స్క్రిప్ట్ దొరికితే వెంటనే చేస్తా” అని టక్కున చెప్పేసిందట. అంటే.. ప్రభాస్ తో అనుష్క సినిమా చేయడానికి స్క్రిప్ట్ దొరక్కపోవడమే ప్రాబ్లెమ్ అన్నమాట అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ జంటతో కొత్త సినిమా అనౌన్స్ అవుతుందేమో చూడాలి. మరి అనుష్క, ప్రభాస్ పెయిర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş