iDreamPost
android-app
ios-app

ఆ ఘటన గుర్తు చేసుకుని రవితేజకు సారీ చెప్పి అనుపమ్‌!

  • Published Oct 05, 2023 | 8:33 PM Updated Updated Oct 05, 2023 | 8:33 PM
  • Published Oct 05, 2023 | 8:33 PMUpdated Oct 05, 2023 | 8:33 PM
ఆ ఘటన గుర్తు చేసుకుని రవితేజకు సారీ చెప్పి అనుపమ్‌!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలాన్ని బట్టి.. మనం చేసే కృషిని బట్టి.. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు అవుతూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇందుకు అనుపమ్‌ ఖేర్‌, రవితేజల ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. తాను స్టార్‌గా ఉన్నపుడు రవితేజను కసురుకున్న అనుపమ్‌ ఖేర్‌.. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన సినిమాలో ఓ పాత్ర చేశారు. తాజాగా, గతం తాలూకా ఆ సంఘటనను గుర్తు చేసుకుని అనుపమ్‌ ఖేర్‌.. రవితేజకు క్షమాపణ చెప్పారు.

టైగర్‌ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన ఇంటర్వ్యూలో ఉండగా.. ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. ‘‘ 1988, అక్టోబర్‌ 9 తేదీన రవితేజ నా స్టూడియోలోకి వచ్చాడు. నేను అక్కడ షూటింగ్‌ చేస్తూ ఉన్నాను. ఓ పిల్లాడితో పాటు నా దగ్గరకు వచ్చాడు. ఫొటో దిగుతామని అన్నాడు. నేను చాలా దురుసుగా ‘‘లేదు.. లేదు.. పోండి!’’ అన్నాను. అది ఎక్కడా రికార్డు కాలేదు. కానీ, నేను అలా చేసినందుకు రవితేజకు సారీ చెబుతున్నా’’ అని అన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. రవితేజ సినిమా ఇండస్ట్రీలో పడ్డ కష్టాలు.. దశాబ్ధాల పాటు మంచి హిట్టుకోసం వేచి ఉండటాన్ని కొనియాడుతున్నారు. కాగా, టైగర్‌ నాగేశ్వర రావు సినిమా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌ నటించారు. అనుపమ్‌ ఖేర్‌, రేణు దేశాయ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి,  1988, అక్టోబర్‌ 9 తేదీన జరిగిన సంఘటనకు అనుపమ్‌ ఖేర్‌ రవితేజకు ఇప్పుడు సారీ చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş