ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు నోరు విప్పుతూనే ఉన్నారు. హీరోయిన్స్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ఏదొక విధంగా.. కెరీర్ లో కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశామని చెబుతున్నారు. ఇప్పటికి చాలామంది పలు ఇండస్ట్రీల నుండి ఈ విషయంపై ఓపెన్ అయినప్పటికీ.. బయటికి రాని బాధితులు ఎంతోమంది ఉన్నారని తెలుస్తోంది. అయితే.. ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులలో తానేమి మినహాయింపు కాదని అంటోంది యంగ్ బ్యూటీ అను ఇమ్మానుయేల్. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా స్టార్స్ సరసన చేసినా.. ఇప్పటిదాకా సరైన హిట్ అందుకోలేకపోయింది.
దాదాపు 7 ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న అను.. అల్లు అర్జున్, నాని, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సరసన నటించింది. చివరిగా అల్లు శిరీష్ సరసన ‘ఊర్వశివో రాక్షసివో’ అనే రొమాంటిక్ మూవీ చేసింది. నార్మల్ గా డీసెంట్ రోల్స్ చేస్తే క్లిక్ అవ్వట్లేదని.. ఈసారి ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ఫుల్ రొమాన్స్ తో ఈ సినిమాలో మెప్పించే ప్రయత్నం చేసింది. అయినా.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురిచేసింది. అయితే.. ఏ రంగంలోనైనా అమ్మాయిలకు వేధింపులు అనేవి ఏదొక విధంగా ఎదురవుతూనే ఉన్నాయి. వాటి గురించి మహిళల పోరాటం కూడా సాగుతూనే ఉంది. ఇండస్ట్రీలో కూడా అంతే.
కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న.. ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి, ఆఫర్స్ విషయంలో జరిగిన బ్లాక్ మెయిల్స్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. అలా కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిన బాధితులలో తాను కూడా ఉన్నానంటోంది అను. రీసెంట్ గా కార్తీతో కలిసి జపాన్ అనే సినిమా చేసింది ఈ భామ. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటుంది అను. ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని.. ఆ టైమ్ లో తనకు ఫ్యామిలీనే అండగా ఉందని చెప్పింది. ఎవరైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేయొచ్చని అను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అను మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి అను ఇమ్మానుయేల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.