iDreamPost
android-app
ios-app

హర్షసాయికి మరో షాక్.. మరోసారి కంప్లయింట్ చేసిన బాధితురాలు.. కేసు నమోదు

  • Published Oct 04, 2024 | 2:59 PM Updated Updated Oct 04, 2024 | 2:59 PM

ప్రజలకు డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయి.. అత్యాచార ఆరోపణలు రావడంతో పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. అతడిపై మరోసారి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇంతకు ఏమైందంటే..?

ప్రజలకు డబ్బులు పంచుతూ ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయి.. అత్యాచార ఆరోపణలు రావడంతో పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. అతడిపై మరోసారి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇంతకు ఏమైందంటే..?

  • Published Oct 04, 2024 | 2:59 PMUpdated Oct 04, 2024 | 2:59 PM
హర్షసాయికి మరో షాక్..  మరోసారి కంప్లయింట్ చేసిన బాధితురాలు.. కేసు నమోదు

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ. 2 కోట్ల తీసుకున్నాడని, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తాగే డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడంటూ కేసు పెట్టింది. ఆ సమయంలో వీడియోలు తీసి బెదిరించాడని పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నటి ఫిర్యాదు చేసి పది రోజులు అవుతున్నా.. ఈ యూట్యూబర్‌ను పట్టుకోలేకపోయారు పోలీసులు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కానీ చిక్కడు, దొరకుడులా తప్పించుకు తిరుగుతున్నాడు హర్షసాయి. విదేశాలకు ఫ్యామిలీ మొత్తం పరారయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బాధితురాలు.. మరోసారి పోలీసులను ఆశ్రయించింది.

హర్షసాయిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.  హర్షసాయి సోషల్ మీడియాలో తన మీద నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను టార్గెట్స్ చేస్తూ కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారని ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్న వారి వెనుక హర్ష సాయి ఉన్నాడని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని నటి ఫిర్యాదులో కోరింది. అందుకు సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్స్‌ను పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులపై చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు మండిపడుతున్నారు. చేసిందే తప్పైతే..  ఇప్పుడు మళ్లీ ఆమెపై ట్రోల్ చేయడం, చేయించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.  హర్షసాయి నువ్వు మారవా అంటూ ప్రశ్నిస్తున్నారు.

హర్షసాయి ఇప్పుడు లైంగి ఆరోపణలపై విమర్శలను ఎదుర్కొంటున్నాడు కానీ.. యూట్యూబ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్. ఆపదలో ఉన్న వారికి డబ్బులు పంచుతూ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని, ఆ డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాంటూ విమర్శలు మొదలయ్యాయి. అంతలోనే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి.. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. హర్షసాయి, అతని తండ్రిపై కూడా ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి యూట్యూబర్ ఫ్యామిలీ పత్తా లేకుండా పోయింది. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా తన ఉనికిని చాటుతున్నాడు హర్షసాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని, డబ్బుల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు బయటకు వస్తాయంటూ పేర్కొన్నాడు. అడ్వకేట్‌ను రంగంలోకి దింపాడు. ఇటు పోలీసులైతే కేసు నమోదు చేశారు కానీ.. హర్షసాయిని పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అతడు విదేశాల్లో ఉన్నాడని, లేదు.. లేదు హైదరాబాద్ లో మకాం వేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరీ పోలీసులకు ఈ యూట్యూబర్  చిక్కుతాడంటారా..? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio