iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి సినిమా నుంచి మరో లీక్

  • Published Feb 16, 2024 | 12:39 PM Updated Updated Feb 16, 2024 | 12:55 PM

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపకుంటుంది. అయితే ఈ సినిమాకు అడ్డంకిగా మారారు లీక్ వీరులు. సినిమా సెట్ లో ఫోటోలు తీసి.. నెట్టింట్లో పెట్టేస్తున్నారు. తాజాగా

ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపకుంటుంది. అయితే ఈ సినిమాకు అడ్డంకిగా మారారు లీక్ వీరులు. సినిమా సెట్ లో ఫోటోలు తీసి.. నెట్టింట్లో పెట్టేస్తున్నారు. తాజాగా

  • Published Feb 16, 2024 | 12:39 PMUpdated Feb 16, 2024 | 12:55 PM
ప్రభాస్ కల్కి సినిమా నుంచి మరో లీక్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి 2898 AD కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అప్డేట్లు కాస్త ఆలస్యం అవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఈ చిత్ర నిర్మాతలు కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సినిమాలోని సీన్స్ లేదా షూటింగ్ సెట్లో వీడియోస్ కాపాడుకోవడానికి గతంలో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు కల్కి సినిమాకు సంబంధించి ఏదో ఒక లీక్ జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ సినిమాలోని ఇమేజ్ లు సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌లలో లీక్ అయి వైరల్ అయ్యాయి.

మే 9, 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని థియేటర్లలో చూడాలని ఎంతో ఆతృతగా ఉన్న అభిమానులు, కల్కి సినిమాకు వరుసగా వస్తున్న సమస్యలను చూసి నిరాశను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లీక్‌లు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభాస్ అభిమానులు. ఇంతకు ముందు ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు కల్కి 2898 AD నిర్మాతలు అధికారికంగా నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఎన్ని సార్లు హెచ్చరించినా ఈ సినిమాకి లీకులు మాత్రం ఆగడం లేదు.

ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న కల్కి సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిషా పటాని, పశుపతి ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన కల్కి 2898 AD సినిమా ఒక విజువల్ వండర్ కావడానికి సిద్ధంగా ఉంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ భారతీయ చలనచిత్రంలో మునుపెన్నడూ లేనంత భారీగా గొప్పగా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని మరియు మరికొంత మంది తారలు కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తారని వినిపిస్తుంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler