iDreamPost
android-app
ios-app

హీరో సూరజ్ అలా అడగటం నన్ను ఎంతో బాధించింది: అంజలి అమీర్

Anjali Ameer: ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి మలయాళంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హేమ కమిటీ నివేదిక తరువాత చాలా మంది నటిీమణులు తమ చేదు అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో నటి కూడా ఓ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది.

Anjali Ameer: ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి మలయాళంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హేమ కమిటీ నివేదిక తరువాత చాలా మంది నటిీమణులు తమ చేదు అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో నటి కూడా ఓ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది.

హీరో సూరజ్ అలా అడగటం నన్ను ఎంతో బాధించింది: అంజలి అమీర్

మలయాళ సినీ పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక ప్రస్తుతం ఇప్పుడు ఈ రిపోర్టు దేశ వ్యాప్తంగా సంచనంలంగా మారింది.  మాలీవుడ్ లో హీరోయిన్లు, లేడీ ఆర్టిస్టులు ఎంతో మంది ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్  నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటు అయింది. ఆ కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చిన సంగతి తెలిసింది. ఇదే సమయంలో పలువురు హీరోయిన్లు, ఇతర నటీమణులు గతంలో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను చెప్పుకుంటున్నారు. తాజాగా మలయాళ యాక్టర్ అంజలి కూడ తన అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మలయాళ తొలి ట్రాన్స్ జెండర్ నటిగా అంజలి గుర్తింపు పొందిన సంగతి తెలిసింది.

మలయాళ నటుడు, జాతీయ అవార్డు విన్నర్ సూరజ్ వెంజరమూడ్ కారణంగా అంజలకి చేదు అనుభవం ఎదురైందంట.  2018లో మమ్ముట్టి నట్టించిన పెరున్బు అనే తమిళ సినిమాలో అంజలి అమీర్ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నాడు. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో సూరజ్ నుంచి అంజలికి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైందంట. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ అంజలని ప్రశ్నించాడని ఆమె తెలిపింది. ఆ సమయంలో తాను ఎంతో కలత చెందానని చెప్పుకొచ్చారు.  ఆయన అడిగేంత వరకు, తనకు అలాంటి బాధకరమైన అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని అంజలి అన్నారు. తాను మానసికంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ… ఆ ప్రశ్న చాలా కోపం తెప్పించదని తెలిపింది. అతడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి..అదే విషయాన్ని మమ్ముట్టి, దర్శకుడికి తాను తెలియజేశానని తెలిపింది.

Anjali Maeer

ఆపై వెంటనే సూరజ్ తనకు క్షమాపణలు చెప్పాడని, మరలా తనతో అలా మాట్లాడలేదని అంజలి అమీర్ పేర్కొన్నారు. అలా చేయడంతో సూరజ్ ను తాను అభినందిస్తున్నాని తెలిపింది.  ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరిగానే మలయాళ ఇండస్ట్రీలో కూడా మంచివాళ్లతో పాటు చెడు వ్యక్తులు కూడా ఉంటారని అండలి పేర్కొంది. కొందరు మాత్రమే కాంప్రమైజ్ లు, ఫేవర్ లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి తెలిపింది.

ఇక సూరజ్ వెంజరమూడ్ గురించి మలయాళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అలానే టాలీవుడ ప్రేక్షకుల్లో  కూడా ఎక్కువ మందికి సూరజ్ గురించి తెలుసు. ఆయన తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. డ్రైవింగ్ లైసెన్స్, దిగ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్  హానీమూన్స్ అనే వెబ్ సిరీస్ లోత టాలీవుడ్ వారికి పరిచయం అయ్యాడు. మరి..తాజాగా మలయాళ నటి అంజలి అమీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.