iDreamPost
android-app
ios-app

Animal Movie: యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. అందరి కళ్లు ఆ ముగ్గురి పైనే

  • Published Jan 07, 2024 | 2:50 PM Updated Updated Jan 08, 2024 | 9:19 AM

యానిమల్ సినిమాతో భారీ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఈ క్రమంలో తాజాగా ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ వివరాలు..

యానిమల్ సినిమాతో భారీ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఈ క్రమంలో తాజాగా ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ వివరాలు..

  • Published Jan 07, 2024 | 2:50 PMUpdated Jan 08, 2024 | 9:19 AM
Animal Movie: యానిమల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. అందరి కళ్లు ఆ ముగ్గురి పైనే

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ వెంటనే బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమానే కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి.. భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత రణ్​బీర్​ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్​గా యానిమల్ సినిమాతో మరోసారి ఇండియాను షేక్ చేశాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1, 2023న విడుదలై.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. నెగిటివ్ టాక్ అందుకుంటూనే సినిమా ఓ రేంజ్​లో సక్సెస్ అయ్యింది.

యానిమల్ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, పృద్వీ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్ర పరిధిలో బాగా నటించారు. యానిమల్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో.. తాజాగా చిత్రబృందం ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. సినిమాలో నటించినవారు.. పని చేసినవారు మాత్రమే కాక.. మరికొందరు సౌత్, బాలీవుడ్ తారలు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ క్రమంలో యానిమల్ హీరో.. రణబీర్ కపూర్ తన భార్య ఆలియాతో కలిసి వచ్చాడు.

animal movie success celebrations

 

అలాగే రష్మిక మందన్న, తమన్నా, మహేష్ భట్, నీతూ కపూర్, త్రిప్తి దిమ్రి, మానుషీ చిల్లర్, బాబీ డియోల్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. ఇంకా అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సక్సెస్ పార్టీకి వచ్చి సందడి చేశారు. ఇంత మంది వచ్చిన ముగ్గురు తారలు మాత్రం తమ గ్లామర్ తో అందరి చూపులు తమవైపే తిప్పుకున్నారు. వారే ఆలియా భట్, తమన్నా, రష్మికా మందన్న.

ఈ ముగ్గురి రాకతో సక్సెస్ సెలబ్రేషన్స్ కాస్త గ్లామరస్ పార్టీగా మారాయి. రాయల్ బ్లూ కలర్ డ్రెస్లో ఆలియా గ్లామర్ మరింత పెరగ్గా.. బ్లాక్ డ్రెస్ లో రష్మిక.. మరింత అందంగా కనిపించింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా అయితే.. మరింత గ్లామర్ డోస్ పెంచింది. ప్రస్తుతం ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు రణ్​బీర్​ తన కెరీర్లో యానిమల్ సినిమాలో చేసిన లాంటి పాత్ర చేయలేదు. తనకు పూర్తిగా భిన్నమైన పాత్రను ఎంచుకుని.. మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ తో రష్మికకు బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఇక యానిమల్ సినిమాతో త్రిప్తి దిమ్రీ ఓవర్​నైట్ స్టార్ అయిపోయింది. సినిమా విడుదల తర్వాత రష్మిక కన్నా ఎక్కువగా ఈమె గురించే అంతా చర్చించుకున్నారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో కూడా ఆఫర్లు వస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetnano girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş