Venkateswarlu
యానిమల్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే నిజం అయింది. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌కు...
యానిమల్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే నిజం అయింది. డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌కు...
Venkateswarlu
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్- దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాపై మొదటినుంచి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ బుకింగ్స్, థియేట్రికల్, ఓటీటీ రైట్స్ విషయంలో రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ప్రీ బుకింగ్స్ విషయంలో ఓవర్‌సీస్‌లో చిత్రం దుమ్ముదులిపింది. ఏకంగా 6 మిలియన్ల ప్రీ బుకింగ్స్‌ను సాధించింది. ఇక, తెలుగునాట యానిమల్‌ను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు.
సినిమా విడుదల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఏర్పాట్లు చేశారు. భారీ అంచనాల నడుమ యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం థియేటర్లలో సందడి మొదలైంది. యానిమల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 3:21 గంటలు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడట. సందీప్ ముందుగానే చెప్పినట్లు చిత్రంలో 20నుంచి 25 వరకు గూస్‌బమ్స్ తెప్పించే సీన్లు ఉన్నాయట. అంతేకాదు! సోషల్ మీడియాలో, మీడియాలో గత కొద్దిరోజులనుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది.
మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ మాట్లాడుతూ.. సినిమా క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వద్దని అన్నాడు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ ఉండనుందన్న ప్రచారానికి బలం చేకూరింది. యానిమల్ ప్రేక్షకుల ముందుకు రావటం.. సినిమాకు సీక్వెల్ ఖరారు అవటం జరిగిపోయింది. మొదటి భాగమే దుమ్మ దులిపేయటంతో.. రెండో భాగం ఎలా ఉండనుందోనని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెండో భాగానికి సంబంధించిన వివరాలు సందీప్ ఎప్పుడు చెబుతాడా? అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక, ఈ చిత్రాన్ని దిల్‌రాజు 15 కోట్ల రూపాయలు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. నైజాం, సీడెడ్, ఆంధ్ర.. మొత్తం మూడు ఏరియాలకు కలిపి ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. యానిమల్ బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా, లాభాలు రావాలన్నా.. 15 కోట్లకుపైగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే.. కలెక్షన్లకు ఏ డోఖా ఉండదని అర్థం అయిపోతోంది. రెండు, మూడు రోజుల్లోనే యానిమల్ లాభాల బాట పట్టనుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కాగా, యానిమల్ సినిమా ఓటీటీకి సంబంధించి ముందుగానే కన్‌ఫర్మేషన్ వచ్చింది. తెలుగులో ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనుందట. థియేటర్లలో విడుదలైన 6నుంచి 7 వారాల తర్వాత ఓటీటీలోకి రానుందట. యానిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ నిడివి విషయంలోనూ ఓ మార్పు జరిగింది. సినిమా థియేటర్లలో 3:21 గంటల నిడివి ఉండగా.. ఓటీలోకి అరగంట ఎక్కువగా.. 4 గంటల నిడివి ఉండనుందట. మరి, యానిమల్ సినిమాకు సీక్వెల్ ఉందన్న కన్‌ఫర్మేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.