iDreamPost
android-app
ios-app

Animal మూవీ ఎఫెక్ట్.. ఆ పాటకు చిందులేసిన స్టార్ క్రికెటర్

  • Published Jan 12, 2024 | 2:17 PM Updated Updated Jan 12, 2024 | 2:17 PM

గత ఏడాది డిసెంబర్ 1న విడుదలై సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి-రణబీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ మూవీలో సాంగ్స్ గురించి చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఈ మూవీలోని ఓ పాటకు..

గత ఏడాది డిసెంబర్ 1న విడుదలై సంచలనం సృష్టించింది. సందీప్ రెడ్డి-రణబీర్ కపూర్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియాలోనే 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ మూవీలో సాంగ్స్ గురించి చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఈ మూవీలోని ఓ పాటకు..

  • Published Jan 12, 2024 | 2:17 PMUpdated Jan 12, 2024 | 2:17 PM
Animal మూవీ ఎఫెక్ట్.. ఆ పాటకు చిందులేసిన స్టార్ క్రికెటర్

గత నెలలో విడుదలై.. ప్రభంజనం సృష్టించిన మూవీ యానిమల్. ఈ సినిమా ఎంత హైప్, బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు తెరకెక్కించాడు. బాలీవుడ్‌కు భారీ హిట్ అందించాడు. రణ బీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఆకట్టుకున్న సంగతి విదితమే. ముఖ్యంగా బాబీ డియోల్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘జమాల్ కుడు’ అయితే ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యింది.

బాబీడియోల్ ఈ పాటకు హూషారుగా చిందులేశాడు. తలపై మందు గ్లాసు పెట్టి..ఫుల్ జోష్ గా డ్యాన్స్ చేస్తాడు. సినిమాలో ఈ సాంగ్ హైలెట్. ఈ ఇరానీ సాంగ్.. ఇటీవల విడుదలై.. యూట్యూబ్‌ను కూడా ఊపేసింది. బాబీ వేసిన స్టెప్పులను ఫాలో అవుతూ.. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రీ క్రియేట్ చేశారు. ట్రెండీగా మారిన ఈ పాటకు ప్రతి ఒక్కరూ కాలు కదిపిన వారే. ఇప్పుడు క్రికెటర్ కూడా ఈ సాంగ్ ప్రేమలో పడిపోయినట్లు ఉన్నాడు. వెస్టీండిస్ క్రికెటర్ నికోలస్ పూరన్ ఈ పాటకు స్టెపుల్లేస్తూ ఆ పిక్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తలపై దాల్ మఖ్నీతో నిండిన గ్లాసును ఉంచి.. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. చేతులు గాల్లోకి లేపాడు ఈ విధ్వంసకర బ్యాటర్. ‘దాల్ మఖ్నీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ‘ అంటూ ఇన్ స్టాలో రాశాడు.

ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు తమ కామెంట్సకు పని చెప్పారు. బాబీడియోల్ వీడియోను ట్యాగ్ చేస్తున్న వారు కొందరైతే.. మరికొంత మంది కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. డేంజరస్ పూనర్ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. నికోలస్ పూరన్.. ఇండియన్ పూరన్ అంటూ రాస్తున్నారు. ప్రస్తుతం పూరన్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికా టీ 20 లీగ్‌లో డర్బన్ సూపర్ జాయింట్స్ జట్టుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కాలంలో క్రికెటర్స్ తమ ఆటతోనే కాదూ.. సినిమా పాటలకు చిందులేస్తూ.. తమలోని మరో టాలెంట్‌ను చూపిస్తూ..క్రికెట్ ఫ్యాన్స్ కు ఖుషీ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nicholas Pooran (@nicholaspooran)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş