Venkateswarlu
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది...
యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది...
Venkateswarlu
యానిమల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. హీరో రణబీర్ కపూర్ సినిమా కెరీర్‌లోనే యానిమల్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్‌సీస్‌లో అయితే, రోజురోజుకు వసూళ్లు పెరుగుతూ పోతున్నాయి. ఓవర్‌సీస్‌లో ఉన్న పాత రికార్డులను సైతం యానిమల్ తుడిచిపెట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ సినిమా బాహుబలి 2 రికార్డులను యానిమల్ బ్రేక్ చేసింది.
యానిమల్ చిత్రం ఓవర్‌సీస్‌లో దాదాపు 633 థియేటర్లలో విడుదల అయింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఏడు లక్షలకుపైగా డాలర్లను వసూలు చేసింది. గతంలో బహుబలి 2పై ఐదు లక్షల డాలర్లపై రికార్డు ఉండింది. ఆ రికార్డును యానిమల్ తుడిచి పెట్టేసేశాడు. 2 లక్షల డాలర్లు ఎక్కువగానే సంపాదించాడు. ఓవర్ సీస్‌లో నాలుగు రోజుల్లోనే 5 లక్షల డాలర్లు వసూలు చేసిన సినిమాల లిస్టులో యానిమల్ 5 స్థానాన్ని సంపాదించింది. యానిమల్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో.. కొత్త స్క్రీన్‌లలో సైతం సినిమా విడుదల అవుతోంది.
కాగా, యానిమల్ డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరినుంచి కూడా మంచి రివ్యూలు వచ్చాయి. మొదటి రోజు ఏకంగా 116 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. దేశ వ్యాప్తంగా దాదాపు 71 కోట్లు.. ఓవర్‌సీస్‌లో 45 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఏకంగా 129 కోట్లు వచ్చాయి.
యానిమల్ ఇప్పటికే అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటపడుతున్నారు. కాగా, యానిమల్ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. నైజాం, సీడెడ్, ఆంధ్రాకు కలిపి దాదాపు 15 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లుగా ఉండింది. బ్రేక్ ఈవెన్‌ను యానిమల్ ఇప్పటికే దాటేసినట్లు తెలుస్తోంది. ఇక, ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి కూడా యానిమల్ రికార్డు క్రియేట్ చేసింది.
థియేటర్లలో ఈ చిత్రం 3.21 నిమిషాల నిడివితో విడుదల అయింది. ఓటీటీ నిడివి విషయంలో మార్పు చోటుచేసుకుంది. దాదాపు అరగంట ఎక్కువగా విడుదల అవ్వనుంది. మొత్తం నాలుగు గంటల నిడివితో స్ట్రీమింగ్ అవ్వనుంది. యానిమల్ ఓటీటీలోకి రావటానికి ఇంకో రెండు వారాలుపైనే పట్టే అవకాశం ఉంది. మరి, యానిమల్ సినిమా ఓవర్‌సీస్‌లో యానిమల్ రికార్డును బ్రేక్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.