iDreamPost
android-app
ios-app

నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే! యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్..

  • Published Jul 17, 2024 | 10:11 AM Updated Updated Jul 17, 2024 | 10:11 AM

నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆదిపురుష్, యానిమల్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు. తన కెరీర్ తొలిరోజుల్లో ఎదురైన చేదు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆదిపురుష్, యానిమల్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు. తన కెరీర్ తొలిరోజుల్లో ఎదురైన చేదు సంఘటనను గుర్తుచేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 17, 2024 | 10:11 AMUpdated Jul 17, 2024 | 10:11 AM
నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే! యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్..

క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పేరు. ఎంతో మంది తారలు తాము క్యాస్టింగ్ కౌచ్ కు గురైయ్యామని తమ లైఫ్ లో జరిగిన చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ‘మీ టూ’ అనే పెద్ద ఉద్యమమే జరిగింది. అయితే లేడీస్ కే కాదు.. మగాళ్లకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైన ఘటనలు పరిశ్రమలో కొన్ని వెలుగుచూశాయి. కొంత మంది నటులు తాము కూడా లైంగిక వేధింపులకు గురైయ్యామని చెప్పుకొచ్చారు. తాజాగా యానిమల్ నటుడు నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సిద్ధాంత్ కర్నిక్.. బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలోనూ ఓ కీలక క్యారెక్టర్ లో మెరిశాడు. అంతకు ముందు ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో కూడా చేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధాంత్ తన కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ కు గురైయ్యానని చెప్పి.. షాక్ కు గురిచేశాడు.

సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ..”అది 2005.. నాకప్పుడు 22 సంవత్సరాలు. ఈ ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి నేను ఎంట్రీ ఇచ్చాను. ఓ సినిమా ఆఫర్ కోసం కో-ఆర్డినేటర్ ను కలిశాను. అతడు నా పోర్ట్ ఫోలియో తీసుకుని.. రాత్రి 10.30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్ లో పిలవడం నాకు వింతగా అనిపించింది. కానీ ఛాన్స్ కోసం వెళ్లకతప్పలేదు. ఇక అక్కడి వెళ్లాక అతడి అసలు స్వరూపం బయటపడింది. ఛాన్స్ కావాలంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. లేదంటే నీకు అవకాశాలు రావు అంటూ.. నా దగ్గరికి జరిగాడు. నేను వెంటనే విషయం అర్ధం చేసుకుని నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేశాను” అంటూ తనకు జరిగిన అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. కాగా.. సిద్ధాంత్ 2004లో టీవీ షో రీమిక్స్ తో తన కెరీర్ ప్రారంభించాడు. ఫేమస్ వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’లో కీలక పాత్ర పోషించాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom