sai
sai
సినిమా వాళ్ల మీద ట్రోలింగ్స్ జరగటం అన్నది సర్వ సాధారణం. ఎక్కువ యాక్టింగ్ గురించి.. యాటిట్యూడ్ గురించి హీరో, హీరోయిన్లపై ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఇక, హీరోయిన్ల విషయానికి వస్తే.. ఎక్కువగా సర్జరీలపై విమర్శలు వస్తూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవటానికో.. లేక అందంగా కనిపించడానికో.. సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ప్రముఖ దివంగత హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ముక్కుకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు.
తల్లి బతికున్న సమయంలోనే ఆమె ముక్కు సర్జరీ చేయించుకున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఆమె సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీపై మొదటి నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. తాజాగా, ట్రోలర్స్ జాన్వీ కపూర్ ముక్కు సర్జరీపై ట్రోలింగ్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు. అయితే, ఈ వీడియోకు లైక్ కొట్టిన వారిలో ఆమె పిన తండ్రి అనిల్ కపూర్ కూడా ఉన్నారు. దీంతో రచ్చ మొదలైంది.
ఆయన కావాలని లైక్ కొట్టారో.. అనుకోకుండా జరిగిందో తెలీదు కానీ, నెటిజన్లు మాత్రం ఆయనపై విరుచుకుపడుతున్నారు. ‘‘ కూతుర్ని అలా తిడుతుంటే మీరు సంతోషపడతారా?’’..‘‘ మీకు మీ అన్నకు గొడవలు ఉంటే.. మీరు మీరు చూసుకోండి.. పిల్లల్ని ఇన్‌వాల్వ్ చేయకండి’’..‘‘ తండ్రివి అయి ఉండి ఇలా ఎలా చేస్తావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, జాన్వీ కపూర్‌ను ట్రోల్స్ చేస్తున్న వీడియోకు అనిల్ కపూర్ లైక్ కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anil kapoor likes reel talking about his niece’s surgeries
byu/Mellow-sid inBollyBlindsNGossip