iDreamPost
android-app
ios-app

యాంకర్ విష్ణుప్రియకు ఏమైంది..? కెరీర్ తో పాటు అన్ని పోయాయంటూ పోస్ట్!

  • Author ajaykrishna Updated - 10:51 PM, Mon - 30 October 23

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ ఈ మధ్య అటు ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండట్లేదు. మరోవైపు సినిమాలు, టీవీ షోలు కూడా ఏవి కూడా చేస్తున్నట్లు సమాచారం లేదు. కానీ.. తాజాగా ఫ్యాన్స్ టెన్షన్ పడే విధంగా ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. మరి ఆ పోస్ట్ ప్రకారం.. విష్ణుప్రియకు ఏమైందని నెటిజన్స్ వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ విష్ణు ఏం పోస్ట్ పెట్టిందంటే..

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓవైపు యాంకర్ గా.. మరోవైపు గ్లామరస్ బ్యూటీగా సోషల్ మీడియాలో.. సినిమాలలో అవకాశం దొరికినప్పుడల్లా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. టీవీ యాంకర్ గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న విష్ణుప్రియ.. కొన్నాళ్ళుగా టీవీ షోలకు దూరంగా ఉంటూ.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది. బుల్లితెర.. సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ లో కూడా విష్ణుప్రియకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకో మరి రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ఒక్కో ప్రైవేట్ సాంగ్ రిలీజ్ చేస్తూ అలరిస్తుంది. ఒకానొక సందర్బంలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

అందుకు కారణం తెలియదు గానీ.. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. అంతా బాగానే ఉందని అనుకుంటున్న టైమ్ లో.. పుణ్య క్షేత్రాలు.. తీర్థయాత్రలు లాంటివి చేస్తూ సర్ప్రైజ్ చేసింది. ఓకే.. అవన్నీ ఆమె పర్సనల్. విష్ణుప్రియ రీసెంట్ గా తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తల్లి మరణంతో చాలా ఒంటరిగా అయిపోయాననే ఫీల్ తో కొద్దిరోజులు మళ్ళీ సైలెంట్ అయింది. ఆ తర్వాత మానస్ తో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ.. ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. కానీ.. సడన్ గా ఏమైందో ఇంస్టాగ్రామ్ లో ఒక్కసారిగా ప్రస్తుత పరిస్థితి ఇది అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. విష్ణుప్రియ ఓ రీల్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఫుల్ గా చిల్ అవుతున్నారు జనం. ఆ వీడియోపై.. మెంటల్ హెల్త్, కెరీర్, ఫిజికల్ హెల్త్, రిలేషన్స్, షెడ్యూల్స్.. ఇలా అన్ని ఖరాబ్(నాశనం అయిపోయాయి అన్నట్లుగా) అయ్యాయని రాసుకొచ్చింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్, విష్ణు ప్రియ ఫ్యాన్స్ అందరిలో కంగారు మొదలైంది. అసలు ఏమైంది విష్ణుప్రియకి? ఏం చేస్తోంది.. ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టింది? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ సినిమాలు, టీవీ షోలు ఏవి చేయట్లేదని సమాచారం. లైఫ్ లో ఏమైనా డిస్టర్బ్ అయ్యిందా? అంటున్నారు ఫ్యాన్స్. మరి విష్ణుప్రియ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Vishnu priya health issue

View this post on Instagram

A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet