iDreamPost
android-app
ios-app

Anchor Suma: గొప్ప మనసు చాటుకున్న యాంకర్ సుమ.. క్రిస్మస్ కానుకగా లక్షల విరాళం!

  • Published Dec 26, 2023 | 10:25 AM Updated Updated Dec 26, 2023 | 10:25 AM

సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తోంది యాంకర్ సుమ. ఇక ఏటా క్రిస్మస్ పండగ సందర్భం బహుమతులు అందజేస్తూ వస్తోంది. తాజాగా రూ. 5 లక్షల విరాళం అందించి తన గొప్ప మనసు చాటుకుంది.

సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తోంది యాంకర్ సుమ. ఇక ఏటా క్రిస్మస్ పండగ సందర్భం బహుమతులు అందజేస్తూ వస్తోంది. తాజాగా రూ. 5 లక్షల విరాళం అందించి తన గొప్ప మనసు చాటుకుంది.

  • Published Dec 26, 2023 | 10:25 AMUpdated Dec 26, 2023 | 10:25 AM
Anchor Suma: గొప్ప మనసు చాటుకున్న యాంకర్ సుమ.. క్రిస్మస్ కానుకగా లక్షల విరాళం!

యాంకర్ సుమ.. బుల్లితెర నుంచి వెండితెర వరకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటు యాంకర్ గా, అటు నటిగా తనకంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు పెట్టింది పేరు సుమ. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా తన మాటలతో మాయ చేసేస్తుంది. ఇక తన కొడుకు రోషన్ కనకాలను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది సుమ. రోషన్ ‘బబుల్ గమ్’ సినిమాతో పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 29న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తోంది సుమ. ఇక ఏటా క్రిస్మస్ పండగ సందర్భం బహుమతులు అందజేస్తూ వస్తోంది. తాజాగా రూ. 5 లక్షల విరాళం అందించి తన గొప్ప మనసు చాటుకుంది.

యంకర్ సుమ సమాజసేవలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ‘ఫెస్టివల్ ఫర్ జాయ్’ అనే స్వచ్చంద సంస్థ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కరోనా సమయంలో ఎన్నో సహాయక కార్యక్రమాలను చేపట్టింది. మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలకు అవసరమైన ఆర్థిక, ఇతర తోడ్పాటును అందిస్తూ.. తన గొప్ప మనసును చాటుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఇక ఏటా క్రిస్మస్ పండగ సందర్భంగా బహుమతులు అందజేస్తూ వస్తుంది. ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు రూ. 5 లక్షల చెక్ ను విరాళంగా అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(NATS) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్ కు ఈ సాయం అందజేసినట్లుగా ఆమె తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఆ మధ్యన ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సుమ. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని మాత్రం అదుకోలేకపోయింది. ఇక ఇప్పుడు తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగానే చేపడుతోంది. సుమ కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో మానస చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సుమ గొప్ప మనసు చాటుకుంటూ.. రూ. 5 లక్షల విరాళం అందివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom