iDreamPost
android-app
ios-app

వాడొక రేపిస్ట్.. ఎలాగైనా కాపాడండి! పోలీసులకు యాంకర్ రష్మీ రిక్వెస్ట్!

  • Author ajaykrishna Published - 02:28 PM, Tue - 11 July 23
  • Author ajaykrishna Published - 02:28 PM, Tue - 11 July 23
వాడొక రేపిస్ట్.. ఎలాగైనా కాపాడండి! పోలీసులకు యాంకర్ రష్మీ రిక్వెస్ట్!

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా రష్మీని సినిమాలు, టీవీ షోలలో చూస్తూనే ఉన్నారు. రష్మీ కూడా జబర్దస్త్ యాంకర్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. ఈ భామకి జంతువులంటే చాలా ఇష్టం. రష్మీ అంటే జంతు ప్రేమికురాలిగా అందరికీ సుపరిచితమే. ప్రపంచంలో జంతువులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినట్లు తెలిసినా వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంది. ఏవైనా మూగజీవాలు హింసకు గురైనట్లు వీడియోలు కంటపడితే.. ఎవరైనా సరే తన ప్రతాపం చూపించేస్తుంది. జంతువుల విషయంలో రష్మీ రియాక్షన్ అప్పుడప్పుడు తంటాలు కూడా తెచ్చిపెడుతుంది.

తాజాగా ఓ వ్యక్తి తన పెట్ డాగ్ ని హింసిస్తున్న వీడియో ఒకటి రష్మీ కంటపడింది. ఇంకేముంది ఎప్పటిలాగే రష్మీ.. సోషల్ మీడియాలో ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. ఆ పెట్ డాగ్ ని కాపాడండి అని పోలీసులను కోరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన పెట్ డాగ్ మెడకు త్రాడు కట్టేసి.. ఆ తాడుతో గాల్లోకి లేపి.. దాని మెడకు ఉరిపడేలా హింసిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని పక్కింటి వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ వీడియోపై యాంకర్ రష్మీ తనదైన శైలిలో స్పందించింది. ఆ ఘటన ఢిల్లీలో జరిగింది గనక.. తన పోస్ట్ లో ఢిల్లీ పోలీసులను, పెటా సంస్థను, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను ట్వీట్ లో ట్యాగ్ చేసింది.

అంతేగాక ఆ పెట్ ని హింసిస్తున్న సదరు వ్యక్తి నుండి కాపాడాలని రిక్వెస్ట్ చేసింది. రష్మీ తన ట్వీట్ లో.. ‘ఆ వ్యక్తి చాలా డేంజర్ గా ఉన్నాడు. అతని వలన ఇంట్లో వాళ్లకి కూడా ప్రమాదమే. వాడు పెట్ ని వేధిస్తున్నట్లే.. పిల్లలను లైంగికంగా వేధించేవాడు కావచ్చు. రేపిస్ట్ కూడా కావచ్చు.’ అని ఘాటుగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ప్రెజెంట్ రష్మీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారగా.. ఆ వీడియో చూసిన నెటిజన్స్ కూడా రష్మీ మాటలకు మద్దతు పలుకుతూ.. బాధిత డాగ్ ని కాపాడాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా రష్మీ ఇండియాలోనే కాదు.. జంతువులకు ఎక్కడ ఏం జరిగినా.. రియాక్ట్ అవుతుంటుంది. ఇక కెరీర్ పరంగా.. సినిమాలు తగ్గించినప్పటికీ.. ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో ఆకట్టుకుంటుంది. మరి రష్మీ షేర్ చేసిన వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom