iDreamPost
android-app
ios-app

ఫస్ట్ టైమ్ తన లవ్ బ్రేకప్ గురించి పెదవి విప్పిన యాంకర్ రష్మీ!

  • Author ajaykrishna Updated - 12:42 PM, Mon - 21 August 23
  • Author ajaykrishna Updated - 12:42 PM, Mon - 21 August 23
ఫస్ట్ టైమ్ తన లవ్ బ్రేకప్ గురించి పెదవి విప్పిన యాంకర్ రష్మీ!

ఎవరి జీవితంలోనైనా లవ్, బ్రేకప్ ఉంటాయి. రెండు ఉంటాయని కాదు.. ఏదోకటి అయినా ప్రతీ ఒక్కరూ ఫేస్ చేస్తుంటారు. కొందరు మాత్రం లైఫ్ లో ఈ రెండింటిని ఫేస్ చేసినవారు ఉంటారు. లవ్ లో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. తీరా మనస్పర్థలు వచ్చేసరికి.. గొడవలు జరిగి విడిపోయే వరకు వెళ్తుంటాయి. అలాంటి బ్రేకప్ అనుభవాలు తన లైఫ్ లో కూడా ఉన్నాయంటోంది గ్లామరస్ యాంకర్ రష్మీ. లవ్ బ్రేకప్స్ అనేవి సెలబ్రిటీలు, సామాన్యులు ఇలా అందరికీ ఒకటే. అయితే.. యాంకర్ రష్మీ లైఫ్ లో బ్రేకప్ లా? ఇన్నాళ్లు సినిమాలు, టీవీ షోలు చేస్తూ.. బాగానే ఉందిగా.. ఎప్పుడు ఏదొక ప్రోగ్రాంలో కనిపించి ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.

అలాంటిది రష్మీ లైఫ్ లో బ్రేకప్ అంటే.. అసలు ఎవరితో బ్రేకప్ అయ్యింది? ఎప్పుడూ లవ్ లో ఉన్నట్లు హింట్ కూడా ఇవ్వలేదు. పైగా ఆమెతో సుడిగాలి సుధీర్ లింక్ చేస్తూ లవ్ లో ఉన్నారంటే.. ట్రోల్స్ ని కూడా ఎంజాయ్ చేసింది. ఆఖరికి కొన్నేళ్లు తనతో కలిసి టీవీ షోలలో కెమిస్ట్రీ పండించిన సుధీర్ తో కూడా ఏం లేదని.. మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసింది. కానీ.. ఇప్పుడు కొత్తగా తన లైఫ్ లో చెప్పలేనన్ని బ్రేకప్స్ ఉన్నాయని చెప్పి షాకిస్తోంది అమ్మడు. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. రష్మీ ఓవైపు యాంకర్ గా టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు అడపాదడపా సినిమాలు కూడా చేస్తోంది. ఈ క్రమంలో చివరిసారిగా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా మెరిసిన రష్మీ.. భోళా శంకర్ లో చిన్న రోల్ చేసింది.

ఇప్పుడు కొత్తగా కన్నడ నుండి తెలుగులోకి డబ్ అయి రిలీజ్ అవుతున్న ‘బాయ్స్ హాస్టల్’ సినిమాలో గెస్ట్ రోల్ తో రెడీ అయిపోయింది. ఈ సినిమా ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న రష్మీ.. తన లైఫ్ లో బ్రేకప్స్ గురించి మాట్లాడింది. రష్మీ మాట్లాడుతూ.. “అందరి లైఫ్ లో హార్ట్ బ్రేక్ అయిన రిలేషన్స్ ఉంటాయి. టీనేజ్ నుండి అరవై ఏళ్ల వరకు ఏదొకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అయితే.. నా బ్రేకప్స్ గురించి చెప్పడం మాత్రం చాలా కష్టం.” అని సెలవిచ్చింది. దీంతో రష్మీ తన బ్రేకప్స్ గురించి చెప్పడమే కష్టం అంటోందంటే.. ఆమె లైఫ్ లో చాలాసార్లు బ్రేకప్ అయ్యిందేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం రష్మీ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రష్మీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio