iDreamPost
android-app
ios-app

Anasuya: అనసూయ ఎమోషనల్ రిక్వెస్ట్.. తనకు దూరంగా ఉండాలంటూ!

Anasuya: అనసూయ ఎమోషనల్ రిక్వెస్ట్.. తనకు దూరంగా ఉండాలంటూ!

అనసూయ.. ఈ పేరు వినగానే అందం, అభినయం, టాలెంటే గుర్తొస్తుంది. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా గుర్తింపు సంపాదించి.. ఇప్పుడు నటిగా కూడా దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా గడిపేస్తోంది. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అనసూయకు ఎంతో గుర్తింపు, ప్రేక్షకాదరణ సొంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనసూయకు ఎనలేని ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. సోషల్ మీడియాలో కూడా అనసూయ హవా మాములుగా ఉండదు. ఒక స్టార్ హీరోయిన్ కి మంచిన రేంజ్ లో ఆమె పేరు మీద ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. ఆమె వ్యక్తిగత ఖాతాల ద్వారా కూడా తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. తాను మనసులో ఏమనుకుంటే దాన్ని నికచ్చిగా చెప్పే స్వభావం కలిగిన వ్యక్తి యాంకర్ అనసూయ.

అందుకే ఆమెపై నెగిటివిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే అనసూయపై ఎన్నోసార్లు ట్రోలింగ్ జరిగింది. అలా జరిగిన ప్రతిసారి ఆమె స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తుండేది. చాలాసార్లు అసభ్యంగా మాట్లాడిన, తిట్టిన నెటిజన్స్ పై సైబర్ టీమ్ కు కంప్లైంట్ కూడా ఇచ్చింది. అవతలి వ్యక్తి ఎంత ట్రోల్ చేస్తే అనసూయ అంతే ఘాటుగా సమాధానం చెబుతూ వచ్చేది. కానీ, తాజాగా అనసూయ అందరికీ ఒక ఎమోషనల్ రిక్వెస్ట్ పెట్టింది. గత కొంతకాలంగా తన పేరును చాలా మంది చాలా విధాలుగా ఉపయోగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలియజేసింది.

రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తన పేరును తప్పుగా, తన ప్రమేయం లేకుండా ఉపయోగిస్తున్నారంటూ వాపోయింది. అలా చేయడం ఆపేయాలని, తనకు దూరంగా ఉండాలంటూ వారికి రిక్వెస్ట్ పెట్టింది. తనకు కూడా కుటుంబం ఉందంటూ ట్వీట్ చేసింది. “అందరికీ నాదొక చిన్న విన్నపం. గత కొద్దిరోజులుగా నా పేరుని రాజకీయ, సినిమా రంగంలో కొందరిని కించ పరిచేందుకు వినియోగిస్తన్నారు. అలా నా పేరుని వాడటం నాకు కూడా అవమానంగా ఉంది. నాకు సంబంధం లేని విషయాల్లోని నా పేరుని లాగుతున్నారు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా నేను లీడ్ చేసుకుంటున్నాను. నేను  అనవసరపు విషయాల్లో తల దూరిస్తే చివరకు బాధ పడాలి అనే విషయం నాకు బాగా తెలసు.

నేను ఒక సెల్ఫ్ మేడ్ ఉమెన్ ని. నాకు ఎలాంటి పీఆర్ లు కూడా లేరు. నా తప్పులను కవర్ చేసేందకు మరే పెయిడ్ టీమ్ నాకు లేదు. మీరు నన్ను పొగడక పోయినా, ప్రోత్సహించకపోయినా పర్లేద.. కనీసం నాకు దూరంగా ఉండండి. అలాంటి వారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను.. మీరు మీ సొంతంగా డిబేట్ చేయలేని విషయాల్లోకి నా పేరుని లాగకండి. నాకు కుటుంబం ఉంది” అంటూ యాంకర్ అనసూయ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్స్ కు అభిమానులు మద్ధతు తెలుపుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోరాటాన్ని ఆపద్దు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet