iDreamPost
android-app
ios-app

రిలేషన్‌షిప్‌ కన్‌ఫర్మ్‌ చేసిన లైగర్‌ బ్యూటీ?

  • Published Oct 28, 2023 | 3:16 PM Updated Updated Oct 28, 2023 | 3:16 PM

అయితే, 2022లో వీరిద్దరికీ బ్రేకప్‌ అయినట్లు సమాచారం. గత కొన్ని నెలలనుంచి అనన్య పాండే ప్రముఖ హీరో ఆధిత్యరాయ్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి.

అయితే, 2022లో వీరిద్దరికీ బ్రేకప్‌ అయినట్లు సమాచారం. గత కొన్ని నెలలనుంచి అనన్య పాండే ప్రముఖ హీరో ఆధిత్యరాయ్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి.

  • Published Oct 28, 2023 | 3:16 PMUpdated Oct 28, 2023 | 3:16 PM
రిలేషన్‌షిప్‌ కన్‌ఫర్మ్‌ చేసిన లైగర్‌ బ్యూటీ?

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనన్య పాండే ‘లైగర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమా ఫలితం పక్కన పెడితే.. తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలైపోయారు. స్టార్‌ కిడ్‌ అయినప్పటికి అనన్య తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, రిలేషన్‌ల విషయంలో మాత్రం తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. అనన్య పాండే గతంలో ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఇషాన్‌ కట్టర్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరూ కలిసి తిరిగినప్పటి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

అయితే, 2022లో వీరిద్దరికీ బ్రేకప్‌ అయినట్లు సమాచారం. గత కొన్ని నెలలనుంచి అనన్య పాండే ప్రముఖ హీరో ఆధిత్యరాయ్‌ కపూర్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. వీరిద్దరూ తరచుగా కలిసి తిరుగుతూ ఉన్న ఫొటోలు, వీడియో బయటకు రావటంతో ఆ వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

అక్కడ వీరిద్దరూ అత్యంత చనువుగా ఉండటం పపరజీల కంట బడింది. వెంటనే దాన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఆ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలను బట్టిచూస్తే.. వీరిద్దరూ తమ రిలేషన్‌ను కన్‌ఫర్మ్‌ చేశారని చెప్పొచ్చు. మరికొద్దిరోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మరి, అనన్య పాండే- ఆధిత్యరాయ్‌ కపూర్‌ రిలేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet