iDreamPost
android-app
ios-app

Ananya Nagalla: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల.. ఎవ్వరూ ఊహించని రోల్ లో!

  • Published May 14, 2024 | 11:01 AM Updated Updated May 14, 2024 | 11:01 AM

ఎవ్వరూ ఊహించని రోల్ లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎవ్వరూ ఊహించని రోల్ లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published May 14, 2024 | 11:01 AMUpdated May 14, 2024 | 11:01 AM
Ananya Nagalla: బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల.. ఎవ్వరూ ఊహించని రోల్ లో!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరస సినిమాలతో దూసుకెళ్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ సోలో హీరోయిన్ గా ముందుకు సాగుతోంది. తన అందం, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇటీవలే ‘తంత్ర’ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టిన అనన్య.. బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టింది. అయితే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం హీరోయిన్ గా కాదు. ఎవ్వరూ ఊహించని రోల్ లో ఆమె హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

అనన్య నాగళ్ల.. టాలీవుడ్ లో సోలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధంచిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటేం? అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందట. ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. కానీ హీరోయిన్ గా అక్కడ అడుగుపెట్టలేదు. ఎవ్వరూ ఊహించని విధంగా రైటర్ గా బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే? అనన్య నటించిన ‘మల్లేశం’ మూవీ డైరెక్టర్ రాజ్ రాచకొండ హిందీలో ‘8AM మెట్రో’ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ కథకు తాను సహకారం అందించినట్లు అనన్య కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రారంభంలో అనన్యకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక స్లైడ్ ఉంది. దాన్ని షేర్ చేసింది అనన్య. దాంతో ఫస్ట్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇద్దామనుకుంటున్నారా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం అనన్య ‘పొట్టేల్’ అనే మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి వస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom