iDreamPost
android-app
ios-app

తరుణ్ కారణంగానే బన్నీకి ‘ఆర్య’ వచ్చిందా? ఆ ఒక్క ఫోన్ కాల్ అల్లు అర్జున్ లైఫ్ మార్చేసిందా?

  • Published May 14, 2024 | 9:43 AM Updated Updated May 14, 2024 | 9:43 AM

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఆర్య.. అల్లు అర్జున్ చేయడానికి కారణం హీరో తరుణ్ అట. ఆ రోజు ఆ ఒక్క ఫోన్ కాల్ చేయడంతో బన్నీ లైఫ్ మారిందట. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఆర్య.. అల్లు అర్జున్ చేయడానికి కారణం హీరో తరుణ్ అట. ఆ రోజు ఆ ఒక్క ఫోన్ కాల్ చేయడంతో బన్నీ లైఫ్ మారిందట. అసలేం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

  • Published May 14, 2024 | 9:43 AMUpdated May 14, 2024 | 9:43 AM
తరుణ్ కారణంగానే బన్నీకి ‘ఆర్య’ వచ్చిందా? ఆ ఒక్క ఫోన్ కాల్ అల్లు అర్జున్ లైఫ్ మార్చేసిందా?

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో చేయాల్సిన చిత్రాలు మరో హీరో చేయడం సర్వసాధారణమే. అయితే ఆ గ్యాప్ లో జరిగే సంఘటనలు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జీవితంలో జరిగిందట. ‘ఆర్య’ అల్లు అర్జున్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే ఆర్య బన్నీచేయడానికి కారణం హీరో తరుణ్ అట. ఆ రోజు ఆ ఒక్క ఫోన్ కాల్ చేయడంతో బన్నీ లైఫ్ మారిందట. అసలేం జరిగింది? ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘ఆర్య’.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం విడుదలై ఇటీవలే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. ఈ సినిమా తన దగ్గరకు రావడానికి కారణం హీరో తరుణ్ అని చెప్పుకొచ్చాడు. దాంతో ఆర్య చిత్రానికి వెనక నడిచిన కథ ఏంటా అని ఆరా తీయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే?

గంగోత్రి చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఆ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. గంగోత్రి సూపర్ హిట్ అయినప్పటికీ.. వెంటనే మరో మూవీ చేయలేదు. ఈ గ్యాప్ లో ఎన్నో కథలు విన్నప్పటికీ.. అవి అతడికి నచ్చకపోవడంతో.. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాడట బన్నీ. ఇలాంటి టైమ్ లో తరుణ్ ఫోన్ చేసి వెంకీ మూవీ స్పెషల్ షో వేస్తున్నారు నువ్వు కూడా రావాలని అని చెప్పాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో.. బన్నీ ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లాడట. అక్కడి ఓ వ్యక్తి బన్నీకి కథ చెబుతానని చెప్పగా.. బన్నీ పెద్దగా పట్టించుకోలేదట. కానీ లైన్ విన్న వెంటనే కథ నచ్చడంతో ఒకే చెప్పాడట. బన్నీకి స్టోరీ చెప్పింది సుకుమారే.

అయితే బన్నీ ఒకే చెప్పగానే మూవీ స్టార్ట్ కాలేదు సుమీ. ఎన్నో సిట్టింగ్స్ తర్వాత మెగాస్టార్, వీవీ వినాయక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత గానీ ఆర్య పట్టాలు ఎక్కలేదట. సో.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్య వెనక ఇంత కథ నడిచిదన్న మాట. దాంతో ఆ రోజు బన్నీకి తరుణ్ ఫోన్ చేయకపోతే.. సుకుమార్ కలిసేవాడే కాదు. ఆర్య చిత్రం వచ్చేది కాదేమో అని ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet