iDreamPost
android-app
ios-app

మళ్ళీ రిపీట్ అవుతున్న ‘బేబీ’ కాంబినేషన్.. ఈసారి అతన్ని మార్చేశారు!

  • Author ajaykrishna Updated - 10:37 AM, Sat - 21 October 23

ఈ ఏడాది సూపర్ హిట్ అయిన బేబీ.. కల్ట్ బొమ్మ అనిపించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్ బస్టర్ బేబీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. వీరి కాంబోలో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు.

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని.. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు. ప్రొడ్యూసర్ SKN ఈ సినిమాని నిర్మించారు. ముందునుండి ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ప్రచారం జరిగిన ఈ సినిమా.. సాంగ్స్, ట్రైలర్ లతో సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది. కట్ చేస్తే.. సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండకు ఫస్ట్ సూపర్ హిట్.. డెబ్యూ హీరోయిన్ గా వైష్ణవికి మంచి బ్రేక్ లభించింది. అంతేగాక అటు డైరెక్టర్ గా సాయి రాజేష్ కి మంచి గుర్తింపుతో పాటు నిర్మాత SKN కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

బేబీ మూవీ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ గురించి తెలిసిందే. బ్లాక్ బస్టర్ టాక్ తో ఏకంగా రూ. 100 కోట్ల వైపు పరుగులు తీసింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఇండస్ట్రీ ప్రముఖులు సైతం సినిమాని, మేకర్స్ ని అభినందించారు. మొత్తానికి ఈ ఏడాది సూపర్ హిట్ అయిన బేబీ.. కల్ట్ బొమ్మ అనిపించుకుంది. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్ బస్టర్ బేబీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. వీరి కాంబోలో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు.

ఈ క్రమంలో బేబీ టీమ్ లో చిన్న మార్పులు జరిగాయి. అదేంటంటే.. కొత్తగా రానున్న సినిమాకు డైరెక్టర్ సాయి రాజేష్ కాదు. ఆయన ఈ సినిమాకు కథ అందిస్తూ.. SKN తో కలిసి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు కూడా బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైందని.. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేసారు. అయితే.. పోస్టర్ ప్రకారం ఈ సినిమా కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా రానుందని అర్ధమవుతుంది. మరి సాయి రాజేష్ ‘కలర్ ఫోటో’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఈసారి ఎలాంటి కథ ప్లాన్ చేశారో చూడాలి. మరి బేబీ కాంబో రిపీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

View this post on Instagram

A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş