iDreamPost
android-app
ios-app

రష్మిక- విజయ్ దేవరకొండపై తమ్ముడు ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రష్మిక- విజయ్ దేవరకొండపై తమ్ముడు ఆనంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రష్మిక- విజయ్ దేవరకొండ పేర్లు కేవలం టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. వీళ్ల మధ్య రిలేషని ఉందని.. వాళ్లు టూర్స్, హాలీడేస్ కలిసి ఎంజాయ్ చేస్తుంటారని కామెంట్ చేస్తుంటారు. అంతేకాకుండా వీళ్లు కావాలనే తమ పోస్టుల్లో హింట్స్ వదిలేస్తుంటారని కూడా చెబుతారు. వాళ్లు నిజంగానే రిలేషన్ లో ఉన్నారని చాలా గట్టిగానే సమర్థంచుకుంటూ ఉంటారు. అయితే ఈ పుకార్లపై ఎప్పుడూ రష్మిక- విడయ్ దేవరకొండ స్పందించింది లేదు. తాము ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని మాత్రం రష్మిక చెబుతుంటుంది. అలాగే ఇటీవల హైదరాబాద్ కు చెందిన మీ ఫేవరెట్ ఫ్రెండ్ స్లాంగ్ లో మాట్లాడండి అంటే విజయ్ ని ఇమిటేట్ చేసింది.

వాళ్లైతే వాళ్ల మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెబుతారు. వీళ్లు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించడం కాస్త క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు అనిపించడంతో ఇలాంటి పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఇలాంటి కామెంట్స్ పై ఆనంద్ దేవరకొండ స్పందించాడు. వాళ్ల మధ్య రిలేషన్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు వారికి సంబంధించిన ఒక విషయాన్ని కూడా లీక్ చేశాడు. ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం బేబీ సినిమా హిట్టుని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రమోషన్స్ లోనే కాకుండా.. ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా హుషారుగా పాల్గొంటున్నాడు. విజయ్- రష్మిక కూడా ఈ బేబీ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు.

ఆమె ప్రమోషన్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఒక సాంగ్ ని లాంఛ్ చేసింది. అయితే ఆ సమయంలో అందరూ వదినా వదినా అంటూ కేకలు వేశారు. వాటిపై తాజాగా ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. విజయ్- రష్మిక ఫ్రెండ్స్ మాత్రమే.. వారి మధ్య అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు. వారు చాలా మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేశాడు. వాళ్లు కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చేయడం, ఇప్పుడు మరో సినిమా చేయడం అంటూ ఫ్లో వెళ్తున్నాడు. ఆ ఫ్లోకి యాంకర్ బ్రేకులు వేయడంతో మనోడు ఆ సినిమా గురించి పూర్తి చేయలేదు. అంటే వాళ్ల మధ్య రిలేషన్ లేదు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు అని ఆనంద్ దేవరకొండ లీక్ ఇచ్చాడు.

అయితే అది ఏం సినిమా? నిర్మాత ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? ఇలాంటి విషయాలు మాత్రం తెలియలేదు. కానీ, విజయ్- రష్మిక కాంబోలో మరో సినిమా రాబోతోంది అనగానే రౌడీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే వాళ్ల మధ్య ఏమున్నా కూడా వీళ్లు మాత్రం వదిన అని ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు. అందుకే మరో సినిమా అనగానే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కిద్దో చూడాలి. ఇప్పటికే రష్మిక డేట్స్ కుదరక నితిన్- వెంకీ కుడుముల సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మరి.. రౌడీ హీరోతో సినిమా చేయాలి అంటే రష్మికకు కుదురుతుందో లేదో చూడాలి. మరోవైపు విజయ్ ఖుషీ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetador girişgrandpashabet