iDreamPost
android-app
ios-app

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ బర్త్ డే.. తమ్ముడు ఆనంద్ ఎమోషనల్ పోస్ట్

  • Published May 09, 2024 | 5:14 PM Updated Updated May 09, 2024 | 5:14 PM

ఇండస్ట్రీలో స్వతహాగా ఎదిగే హీరోలు చాలా కొద్దీ మంది మాత్రమే ఉంటారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అయితే ఈరోజు విజయ్ దేవర కొండ పుట్టిన రోజు సంధర్బంగా అతని తమ్ముడు పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇండస్ట్రీలో స్వతహాగా ఎదిగే హీరోలు చాలా కొద్దీ మంది మాత్రమే ఉంటారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. అయితే ఈరోజు విజయ్ దేవర కొండ పుట్టిన రోజు సంధర్బంగా అతని తమ్ముడు పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published May 09, 2024 | 5:14 PMUpdated May 09, 2024 | 5:14 PM
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ బర్త్ డే.. తమ్ముడు ఆనంద్ ఎమోషనల్ పోస్ట్

సినీ ఇండస్ట్రీకి హీరోలు అవుదామని వచ్చి..తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఓడిపోయి వెనుతిరిగిన హీరోలు ఉంటారు. ఓడిపోయినా కూడా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసి తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నవారు ఉన్నారు. హీరో విజయ్ దేవరకొండ రెండో రకానికి చెందిన వ్యక్తి . నటనపైన ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. క్రమ క్రమంగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు విజయ్ దేవర కొండ. ఇక ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సంధర్బంగా సోషల్ మీడియా అంతా కూడా.. తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తమ్ముడు.. ఆనంద్ దేవర కొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్.. వైరల్ అవుతుంది.

విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సంధర్బంగా.. ఆనంద్ దేవర కొండ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. వారిద్దరి చిన్నప్పటి ఫొటోస్ షేర్ చేస్తూ.. తన అన్న గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నాడు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యా.. ఎలా జీవించాలి అన్నదానికి నువ్వు ప్రత్యేక్ష ఉదాహారణ. ధృడంగా ఉండడం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ, ఇంకా చాలా నీ నుంచి నేర్చుకున్నాను. ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారి ఎంతో బలంగా తిరిగి వచ్చావు” అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చాడు. దీనితో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో అతని అభిమానులు కూడా విజయ్ కు విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. తన కెరీర్ మొదట్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలలో నటించాడు విజయ్. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అందరి ముందుకు వచ్చాడు. ఇక అప్పుడు స్టార్ట్ అయిన విజయ్ దేవరకొండ సినీ కెరీర్ ఇప్పటివరకు కూడా మంచి మంచి హిట్స్ తో కొనసాగుతూ ఉంది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి తీరాలి. ఆ తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకోదగ్గ సినిమా అంటే సాఫ్ట్ రోల్ లో కనిపించిన గీత గోవిందం సినిమానే. ఇక తాజాగా విజయ్ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. థియేటర్ లో ఈ సినిమా మిక్సస్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ.. ఓటీటీ లో మాత్రం దూసుకుపోతుంది. ఇక ఈ రోజు విజయ్ పుట్టిన రోజు సందర్బంగా అతను చేయబోయే కొత్త ప్రాజెక్ట్స్ కు సంబంధించిన విషయాలను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. మరి ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో విజయ్ దేవర కొండ గురించి ట్వీట్ చేసిన విషయంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş