iDreamPost
android-app
ios-app

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్‌కు గాయాలు

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కొరియోగ్రఫర్లు ఉన్నారు. అయితే ఈ రంగంలో కూడా మేల్ డ్యాన్స్ మాస్టర్లదే హవా. అలాంటి రంగంలో రాణిస్తున్నారు బృందా మాస్టర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుండి.. ఇండిపెండెంట్ డ్యాన్స్ మాస్టర్ గా మారారు ఆమె. ఇప్పుడు..

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కొరియోగ్రఫర్లు ఉన్నారు. అయితే ఈ రంగంలో కూడా మేల్ డ్యాన్స్ మాస్టర్లదే హవా. అలాంటి రంగంలో రాణిస్తున్నారు బృందా మాస్టర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుండి.. ఇండిపెండెంట్ డ్యాన్స్ మాస్టర్ గా మారారు ఆమె. ఇప్పుడు..

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్‌కు గాయాలు

సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్లుగా, కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు అనేక మంది. అయితే ఈ రంగంలో మేల్ డామినేషన్ ఎక్కువ. అలాంటి సమయంలో కూడా తనను తాను నిరూపించుకున్నారు ఫిమేల్ కొరియోగ్రాఫర్ బృందా. అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ నుండి ఇప్పుడు ఫేమస్ డ్యాన్స్ మాష్టారుగా మారారు. 1987 నుండి మూవీ ఫీల్డ్‌లో ఉన్నారు. 2000లో వచ్చిన తమిళ్ మూవీ ముగవరీతో ఇండిపెండెంట్ కొరియోగ్రఫర్‌గా మారిన బృందా మాస్టర్.. మొన్న పొన్నియన్ సెల్వన్ సినిమాకు మంచి స్టెప్పులు అందించారు. దర్శకురాలిగా మారి హే సినామిక అనే మూవీని కూడా తెరకెక్కించారు. ఇప్పుడు ఆమె మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్పకు పని చేస్తున్నారు.

అయితే అందిన సమాచారం ప్రకారం.. కన్నప్ప షూటింగ్ సమయంలో బృందా మాస్టర్‌కు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఆమె కాలికి గాయమైంది. ఓ పాటను షూట్ చేస్తుండగా.. కాలు ప్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం జరిగినట్లు సమాచారం. దీంతో షూటింగ్‌ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ విడుదల చేసిన ఫస్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి విదితమే.

అలాగే ఇటీవలే ఈ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు నటుడు మోహన్ లాల్. ఆయనకు కన్నప్ప టీం ఘన స్వాగతం పలికింది. న్యూజిలాండ్ స్పెషల్ డాన్స్.. హకా డాన్స్‌తో మాలీవుడ్ నటుడికి గ్రాండ్ వెల్కం పలికింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా కన్నప్ప మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో బృందా మాస్టర్ కాలికి గాయం కావడంతో మళ్లీ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదే సినిమా షూటింగ్ లో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం కూడా సందడి చేసిన సంగతి విదితమే. మరీ ఈ సినిమాపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్లలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet