iDreamPost
android-app
ios-app

పూరీ.. ఇదీ నీ రేంజ్..! నీకు అర్ధం కావడం లేదంతే!

  • Published Nov 29, 2023 | 1:49 PM Updated Updated Nov 29, 2023 | 2:55 PM

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం ఇప్పుడు తమిళ్ లో సీక్వెల్ గా రానుంది. దీనికి సంబంధించి ఓ వార్తను అధికారింగా అనౌన్స్ చేశారు డైరెక్టర్ మోహన్ రాజా.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం ఇప్పుడు తమిళ్ లో సీక్వెల్ గా రానుంది. దీనికి సంబంధించి ఓ వార్తను అధికారింగా అనౌన్స్ చేశారు డైరెక్టర్ మోహన్ రాజా.

  • Published Nov 29, 2023 | 1:49 PMUpdated Nov 29, 2023 | 2:55 PM
పూరీ.. ఇదీ నీ రేంజ్..! నీకు అర్ధం కావడం లేదంతే!

పూరీ జగన్నాథ్.. ఈ పేరు వింటే సినీ అభిమానుల రోమాలు నిక్కబోడుస్తాయి. అతని సినిమాల్లోని డైలాగులు విన్నా, సీన్స్ చూసిన అక్కడ మొదటగా కనిపించేది పూరీ మాత్రమే. ఇక అతని చిత్రాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అతని రేంజ్ ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. టాలీవుడ్ లో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నా.. అందులో పూరీ వేరనే చెప్పాలి. ఎవరినైన ఏదైనా డైలాగ్ చెప్పడంటే అంటే.. ఖచ్చితంగా పూరీ సినిమాల్లోదే చెప్పేస్తుంటారు. ఇలా అతని చిత్రాల్లోని పాత్రలకు, డైలాగులకున్న పవర్ అలాంటిది మరి. ఇలా డిఫరెంట్ కథనంతో సినిమాలు తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు పూరీ జగన్నాథ్.

ఇక ఆయన తెరకెక్కించిన బద్రి, ఇడియట్, పోకిరీ, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అయితే, పూరీకి హిట్ లేక చాలా ఏళ్లు అవుతుందనే చెప్పాలి. దాని కోసం ఆయన ఎంతగానో శ్రమిస్తున్నారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన లైగర్ చిత్రం కూడా బోల్తా కొట్టింది. ఈ దెబ్బతో పూరీ మరింత పదును పెట్టేందుకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. 2003లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని రికార్డులు తిరగరాసింది. ఈ మూవీ హిట్ తో రవితేజ హీరోగా మరో మెట్టు ఎక్కాడు. ఇదే చిత్రాన్ని తమిళంలో సీక్వెల్ గా తెరకెక్కించేందుకు గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే, అంత కంటే ముందు ఈ మూవీని తమిళంలో ఎం. కుమారన్ సన్నాఫ్ మహాలక్ష్మి పేరుతో రీమెక్ చేశారు. ఇక ఇదే మూవీని ఇప్పుడు డైరెక్టర్ మోహన్ రాజా సీక్వెల్ తెరకెక్కించేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డైరెక్టర్ మోహన్ రాజా అధికారికంగా అనౌన్స్ చేశారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో సీక్వెల్ గా తీసుకురానుండడంతో పూరీ రేంజ్ ఏంటనేది దీంతోనే స్పష్టంగా అర్థమవుతోంది. పూరీ ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారంటే అతని సత్తా ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. ఇక టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్ ని అభిమానించే ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారంటే అతని రేంజ్ ఎలాంటి తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు ఒక హిట్ కావాలి. లైగర్ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో అతడు మరో ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. ప్రస్తుత పూరీ జగన్నాథ్ రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతోనైన పూరీ హిట్ కొడతాడమే చూడాలి మరి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş