iDreamPost
android-app
ios-app

చక్ దే ఇండియాతో మా సినిమాకి సంబంధం లేదు: అమిత్ శర్మ

  • Published Apr 02, 2024 | 1:55 PM Updated Updated Apr 02, 2024 | 4:08 PM

తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మైదాన్ సినిమాతో చక్ దే ఇండియాని పోలుస్తున్న వారి గురించి అమిత్ శర్మను అడిగారు. కోచ్, ఆటగాళ్ల కథ కారణంగా ప్రేక్షకులు ఈ రెండు సినిమాలని పోల్చి చూస్తున్నారని ఈ దర్శకుడు అన్నారు. చూడకముందే మైదాన్ ఇలాంటి సినిమా అని జనాలు ఊహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మైదాన్ సినిమాతో చక్ దే ఇండియాని పోలుస్తున్న వారి గురించి అమిత్ శర్మను అడిగారు. కోచ్, ఆటగాళ్ల కథ కారణంగా ప్రేక్షకులు ఈ రెండు సినిమాలని పోల్చి చూస్తున్నారని ఈ దర్శకుడు అన్నారు. చూడకముందే మైదాన్ ఇలాంటి సినిమా అని జనాలు ఊహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Published Apr 02, 2024 | 1:55 PMUpdated Apr 02, 2024 | 4:08 PM
చక్ దే ఇండియాతో మా సినిమాకి సంబంధం లేదు: అమిత్ శర్మ

బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ శర్మ తన కొత్త చిత్రం మైదాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారత ఫుట్‌బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. మైదాన్ థియేటర్లలో విడుదలయ్యే ముందు, దర్శకుడు అమిత్ శర్మ తన సినిమాకు, షారుఖ్ ఖాన్ నటించగా 2007లో విడుదలైన హిట్ చక్ దే ఇండియాకు మధ్య ఎలాంటి పోలికలు లేవని చెప్పారు. మైదాన్ సినిమా ఒక స్పోర్ట్స్ బయోపిక్ కాదని చిత్ర నిర్మాత మరీ మరీ చెప్పారు.

తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మైదాన్ సినిమాతో చక్ దే ఇండియాని పోలుస్తున్న వారి గురించి అమిత్ శర్మను అడిగారు. కోచ్, ఆటగాళ్ల కథ కారణంగా ప్రేక్షకులు ఈ రెండు సినిమాలని పోల్చి చూస్తున్నారని ఈ దర్శకుడు అన్నారు. చూడకముందే మైదాన్ ఇలాంటి సినిమా అని జనాలు ఊహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఫీల్డ్‌లో 22 మంది ఆటగాళ్లు ఒక్క బంతి వెంట పరిగెత్తడం తప్ప రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలికలు లేవని అన్నారు. కథ వేరు, పోరాటం వేరు. మైదాన్ అనేది సయ్యద్ అబ్దుల్ రహీమ్ వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణానికి సంబంధించినదని, ఫుట్‌బాల్ స్పోర్ట్ కేవలం ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమేనని అమిత్ పేర్కొన్నారు.

Our film has nothing to do with Chak De India

మైదాన్ 1952 నుండి 1962 వరకు భారత ఫుట్‌బాల్ కోచ్‌గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ రహీమ్‌గా కనిపిస్తారు, ప్రియమణి అతని భార్య సైరా పాత్రను పోషించారు. గజరాజ్ రావు, రుద్రనీల్ ఘోష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మైదాన్ ఏప్రిల్ 10, 2024 (ఈద్)న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల బడే మియా చోటే మియాతో ఢీకొంటుంది. రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. మైదాన్‌కి అమిత్ దర్శకత్వం వహించగా, బడే మియా చోటే మియా సినిమాని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. అయితే ఈ రెండిట్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.