iDreamPost
android-app
ios-app

ఈ రింగుల బ్యూటీ గుర్తుందా? ఇప్పుడు పూర్తిగా మారిపోయి, ఓ రేంజ్‌లో!

  • Published Sep 02, 2024 | 12:54 PM Updated Updated Sep 02, 2024 | 12:54 PM

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కంచిన చిత్రాల్లో ఒకటి అమీతుమీ. ఈ చిత్రంతో అడవి శేష్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అవసరాలకు పెయిర్ గా నటించిన ఈ రింగుల బ్యూటీ గుర్తుందా..?

ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కంచిన చిత్రాల్లో ఒకటి అమీతుమీ. ఈ చిత్రంతో అడవి శేష్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అవసరాలకు పెయిర్ గా నటించిన ఈ రింగుల బ్యూటీ గుర్తుందా..?

  • Published Sep 02, 2024 | 12:54 PMUpdated Sep 02, 2024 | 12:54 PM
ఈ రింగుల బ్యూటీ గుర్తుందా? ఇప్పుడు పూర్తిగా మారిపోయి, ఓ రేంజ్‌లో!

విభిన్న కథలను చాలా సున్నితంగా తెరకెక్కించే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన కథలోని కథానాయికలకు మహేష్ బాబు అంటే క్రేజ్. అష్టా చెమ్మలోనే కాదు.. అమీతుమీలో కూడా ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది. 2017లో వచ్చిన ఈ కామెడీ ఓకే అనిపించుకుంది. అడవిశేష్, ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్, అదితి మ్యాకల్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇందులో ఈషా రెబ్బ, అవసరాల శ్రీనివాస్ బ్రదర్ అండ్ సిస్టర్‌గా నటించారు. ఇందులో ఈషాకు ఫ్రెండ్ క్యారెక్టర్, అవసరాలకు జోడీగా మాయ పాత్రలో నటించిన రింగు రింగుల జుట్టు అమ్మాయి గుర్తుందా. ఆమె మన తెలుగు అమ్మాయి అదితి మ్యాకల్. కొన్ని రోజుల నుండి తెరకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..?

ఇంద్రగంటి మోహన్ కృష్ణ హీరోయిన్ అదితి.. పక్కా తెలుగమ్మాయి. కామారెడ్డిలో పుట్టిన ఆమె తండ్రి ఓ కాలేజీ ప్రిన్సిపల్. చిన్నప్పుడు కూచిపూడిలో ప్రావీణ్యురాలైన ఆమె పలు ప్రదర్శనలు ఇచ్చింది. నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసిన అదితి.. కాస్ట్యూమ్ డిజైన్ చేసుకుని మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. మోడలింగ్ చేస్తూ యూట్యూబ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించేది. పాప పి సుశీల, ముద్ద పాప ఆవకాయ, పోష్ ప్యారీస్ వంటి వెబ్ సిరీస్ చేసింది. ఇవి ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టాయి. అమీతుమీ చేస్తుండగానే విజయ్ దేవరకొండ- సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఇందులో విజయ్ స్నేహితురాలిగా కనిపించింది. ఇందులో చిన్న పాత్రే అయినప్పటికీ గుర్తింపు వచ్చింది. అలా వరుస ఛాన్సులు కొల్లగొట్టింది. శర్వానంద్ రాధ చిత్రంలో కూడా యాక్ట్ చేసింది.

మిఠాయి, షాదీ ముబారక్, నేను లేనీ నీ ప్రేమకథ, 24 కిసెస్, దెబ్బకు ఠా దొంగల ముఠా చిత్రాల్లో నటించింది. ఏకమ్ వెబ్ సిరీస్‌తోనూ ఆకట్టుకుంది. గత ఏడాది జీ5లో వచ్చిన మాయ బజార్ ఫర్ సేల్‌లో కూడా నటించింది ఈ తెలుగు బ్యూటీ. దీని తర్వాత ఆమె తెరపై కనిపించలేదు. అయితే కొత్త కథలు వింటున్నట్లు సమాచారం. గతంలో సోషల్ మీడియాలో కూడా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండేది ఈ భామ. తన హాట్ హాట్ ఫోటోలతో కాక రేపేది. ఈ ఏడాది జనవరిలో పుట్టిన రోజు చేసుకున్న తర్వాత ఆమె ఇన్ స్టాలో కూడా యాక్టివ్‌గా వ్యవహరించడం లేదు. సినిమాల్లో క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసే ఈ చిన్నది.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సన్నింగ్ పిక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. త్వరలో కొత్త మూవీతో ప్రేక్షకులను పలకరించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Aditi Myakal (@aditi.myakal)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet