iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం!

  • Published Nov 14, 2023 | 1:45 PM Updated Updated Nov 14, 2023 | 1:45 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఆయనకంటూ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. హౌస్‌లో మైండ్‌ గేమ్‌ ఆడుతూ.. తోటి కంటెస్టెంట్లకు గట్టీ పోటీ ఇస్తున్నారు....

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ఆయనకంటూ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. హౌస్‌లో మైండ్‌ గేమ్‌ ఆడుతూ.. తోటి కంటెస్టెంట్లకు గట్టీ పోటీ ఇస్తున్నారు....

  • Published Nov 14, 2023 | 1:45 PMUpdated Nov 14, 2023 | 1:45 PM
బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కు  రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం!

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు సుకుమార్‌ శిష్య గణం పరిశ్రమలో రికార్డులు సృష్టిస్తోంది. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల ‘దసరా’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. ఇది దర్శకుడిగా శ్రీకాంత్‌ డెబ్యూ సినిమా కావటం విశేషం. ఇక, సుకుమార్‌ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు కూడా తన మొదటి సినిమాతో రికార్డులు సృష్టించారు.  ఉప్పెనతో ఇండస్ట్రీని ఊపేశారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని మెప్పించటమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టించింది.

100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఉప్పెన సినిమా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఏ సినిమాను స్టార్ట్‌ చేయలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో సినిమాలు ఓకే అయినప్పటికి షూటింగ్‌ ఇంకా మొదలుకాలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాకంటే ముందే రామ్‌ చరణ్‌ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు తాజాగా, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లారు.

ఈ సందర్భంగా హౌస్‌లోని కంటెస్టెంట్లతో ముచ్చటించారు. అర్జున్‌ అంబటి ప్రస్తావన రాగా.. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘‘ నువ్వు సూపర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నావు.. రామ్‌ చరణ్‌ గారి సినిమాలో.. ఫిక్స్‌ అయిపో.. ’’ అంటూ భరోసా ఇచ్చారు. దీంతో అర్జున్‌ అంబటి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘థాంక్యూ బుచ్చన్న’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న రామ్‌ చరణ్‌, అర్జున్‌ ఫ్యాన్స్‌ ‘‘ రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు..’’.. ‘‘నీకు ఆ అర్హత ఉంది’’..

‘‘ ఈ సారి కప్‌ అర్జున్‌ అంబటికే.. ఇది ఫిక్స్‌’’.. ‘‘గ్లోబల్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసావు.. నువ్వు మామూలోడివి కాదు..’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  కాగా, అర్జున్‌ అంబటి 2015లో వచ్చిన ‘ గీతోపదేశం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2016లో వచ్చిన ‘ అర్థనారి’ సినిమాలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్నిసాక్షి అనే సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బుల్లితెరపై నటుడిగా బిజీ అయిపోయారు.

ఓ వైపు సీరియళ్లు చేస్తూనే.. అంది వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చీ.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. తనదైన శైలిలో మైండ్‌ గేమ్‌ అడుతూ.. ఎలిమినేషన్స్‌నుంచి తప్పించుకుంటూ ముందుకు సాగుతున్నారు. టాప్‌ కంటెస్టెంట్లు అయిన అనుదీప్‌, పల్లవి ప్రశాంత్‌, శివాజీలకు గట్టి పోటీ ఇస్తున్నారు. మరి, అంబటి అర్జున్‌.. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమాలో అవకాశం దక్కించుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş