Aditya N
ఈ సినిమాలో ఆమె నటన హైలైట్ గా నిలిచిందని, శక్తివంతమైన పాత్రలో తనదైన నటనతో ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యపరిచారు.చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న శరణ్య గత ఏడాది కాలంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు
ఈ సినిమాలో ఆమె నటన హైలైట్ గా నిలిచిందని, శక్తివంతమైన పాత్రలో తనదైన నటనతో ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యపరిచారు.చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న శరణ్య గత ఏడాది కాలంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు
Aditya N
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించారు. ఈ సినిమా విజయం పై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ దూకుడుగా సినిమాను ప్రమోట్ చేసింది. అందుకు తగిన ప్రతిఫలం దక్కినట్లే కనిపిస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రాగా ముఖ్యంగా నటి శరణ్యకు మంచి గుర్తింపు వచ్చింది.
సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో శరణ్య ప్రదీప్ అతని కవల సోదరిగా నటించారు. ఈ సినిమాలో ఆమె నటన హైలైట్ గా నిలిచిందని, శక్తివంతమైన పాత్రలో తనదైన నటనతో ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యపరిచారు.చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న శరణ్య గత ఏడాది కాలంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విలన్ నితిన్ నుంచి వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిగా ఆమె తిరుగులేని నటనను ప్రదర్శించారు. ఫిదా, జాను, భామా కలాపం వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించిన శరణ్య ప్రదీప్ కెరీర్లో అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఒక టర్నింగ్ పాయింట్ గా మారినట్టేనని సినీ ప్రేమికులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ సినిమాలో విషయానికి వస్తే.. సుహాస్ హీరోగా నటించగా… శివానీ నగరం హీరోయిన్ గా నటించారు. కొత్త దర్శకుడు దుశ్యంత్ ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. పుష్ప కేశవగా ప్రసిద్ధి గాంచిన జగదీష్, నితిన్ ప్రసన్న, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించగా.. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.