అమరన్ మూవీ లో చూపించబోతున్న మేజర్ ముకుంద్ ఎవరు? ఫుల్ స్టోరీ..

Major Mukund varadarajan life story: రీసెంట్ గా సోషల్ మీడియాలో సాయి పల్లవి , శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ అక్టోబర్ 31 కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో అందరికి ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఈ మేజర్ ముకుంద్ ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. మరి ఆ మేజర్ ముకుంద్ ఎవరో చూసేద్దాం.

Major Mukund varadarajan life story: రీసెంట్ గా సోషల్ మీడియాలో సాయి పల్లవి , శివ కార్తికేయన్ నటించిన అమరన్ మూవీ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ అక్టోబర్ 31 కి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో అందరికి ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. అసలు ఈ మేజర్ ముకుంద్ ఎవరు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. మరి ఆ మేజర్ ముకుంద్ ఎవరో చూసేద్దాం.

హీరో శివ కార్తికేయన్ , సాయి పల్లవి కాంబినేషన్ లో.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న మూవీ ‘అమరన్’ . తమిళంతో పాటు ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కాబోతుంది. అక్టోబర్ 31 న దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా డీసెంట్ హైప్ సొంతం చేసుకుంటుంది. ఇది మేజర్ ముకుంద్ వరదరాజన్ బయో పిక్ కావడంతో.. అందరికి ఇంకాస్త క్యూరియాసిటీ పెరిగింది. అలాగే అసలు ఎవరు ఈ మేజర్ ముకుంద్. అతను వార్ లో ఎలా చనిపోయారు.. ఎంతో మంది ఆర్మీ జవాన్ లు ఉండగా అతని స్టోరీని ఎందుకు సినిమాగా తీశారు.. అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. అసలు ఈ మేజర్ ముకుంద్ ఎవరో తెలుసుకుందాం.

దేశంలో మనమంతా ధైర్యంగా జీవిస్తున్నాం అంటే అది కేవలం భారత సైన్యం దయవల్లనే. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న.. భారత సైనికుల ధైర్య సాహాసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారు మనకు అందిస్తున్న రక్షణ బలం గురించి తెలుసుకుంటే.. గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ హిస్టరీలో గుర్తిండిపోయే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఒకరు మేజర్ ముకుంద్ వరదరాజన్. శ్రీ ఆర్ వరదరాజన్, శ్రీమతి గీత గార్లకు 1983 ఏప్రిల్ 12 న కేరళలో ముకుంద్ జన్మించారు. ఆయన పుట్టింది కేరళలో అయినా  చదువు మాత్రం చెన్నైలోనే కంప్లీట్ చేశారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నారు. ముకుంద్ మామయ్య , తాతయ్య ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తారు. ముకుంద్ తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగా.. వాళ్ళ మామయ్య ఆర్మీలో ట్రై చేయమనే సలహా ఇచ్చారు .

కానీ ముకుంద్ తల్లిదండ్రులకు మాత్రం అతను ఇండియన్ ఆర్మీకి వెళ్లడం ఇష్టం లేదు. అయినా సరే ఎలా అయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలని అప్లై చేశారు. అలా 2006 లో రాజ్ పుత్ రెజిమెంట్ మిలట్రీ ఫోర్స్ లో లెఫ్టినెంట్ గా అప్పోయింట్ అయ్యారు. అక్కడ రెండేళ్ల తర్వాత కెప్టెన్ గా ప్రమోట్ అయ్యాడు. అలా 2009 లో అతను కాలేజ్ లో ప్రేమించిన ఇందు రెబెకా వర్గీస్ ను పెళ్లి చేసుకున్నారు. 2011 లో వారిద్దరికీ ఓ కూతురు జన్మించింది. అటు ఆర్మీలో కూడా ముకుంద్ కెప్టెన్ గా చాలా స్ట్రాంగ్ టీం ను రెడీ చేసుకున్నారు. ఆయన చాలా ఆపరేషన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. ఆ తర్వాత 2012లో ఆయన కల కన్న లైఫ్ టైమ్ డ్రీం నెరవేరింది. అదేంటంటే..ముకుంద్ చేసిన సక్సెస్ ఫుల్ ఆపేరేషన్స్ ను చూసి.. 2012 లో ఇండియన్ ఆర్మీ ఆయనను 44 రాష్ట్రీయ రైఫిల్స్ టీం లో జాయిన్ అవ్వమని చెప్పింది. ముకుంద్ జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన మేజర్ పొజిషన్ కు రీచ్ అయ్యారు. అసలు కథ అప్పుడే మొదలైంది.

2014 లో ఒక రోజు ఆర్మీ బేస్ కు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ లో సౌత్ కాశ్మిర్ దగ్గర ఒక విలేజ్ లో కొంతమంది ఉగ్రవాదులు ఆపిల్ ట్రీస్ దగ్గర ఉన్నారని చెప్పారు. వెంటనే అఫీషియల్స్ ముకుంద్ ను టీం తో సహా అక్కడకు వెళ్లి.. ఉగ్రవాదుల లీడర్ అయిన అల్తాఫ్ ను చంపి, అతని దగ్గర ఉన్న డిజిటల్ డాక్యుమెంట్స్ ను రికవరీ చేసుకురమ్మని చెప్పారు. ఏ మాత్రం లేట్ చేయకుండా ముకుంద్ తన టీమ్ తో కాశ్మిర్ కు వెళ్ళారు. ఎప్పుడైతే ఆ టీం ఉగ్రవాదులను సరౌండ్ చేశారో.. ఉగ్రవాదులు వీరిపై దాడి చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మేజర్ టీం ఆ ఉగ్రవాదిని కాల్చి.. తన దగ్గర ఉన్న మొబైల్ , డాక్యుమెంట్స్ తీసుకు వచ్చి ముకుంద్ కు ఇచ్చారు. వాటితో అల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నారు. వెంటనే ముకుంద్ తన టీం ను తీసుకుని.. ఆ ప్లేస్ కు వెళ్ళారు. ఆ ఉగ్రవాదుల టీం ఏడుగురు ఉంటె.. ముకుంద్ టీం ఐదుగురు మాత్రమే ఉన్నారు. దీనితో ఉగ్రవాదులను చంపడమే వారి లక్ష్యం అని.. వారి దగ్గర ఉన్న మొబైల్స్ , ల్యాప్ టాప్స్ రికవరీ చేయాలనీ మేజర్ తన టీం కు చెప్పారు.

టీం మొత్తం కూడా ఉగ్రవాదుల మీదకు వీరోచితంగా కాల్పులు జరిపి వారిని చంపేశారు. కానీ ఇంట్లో ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారనే అనుమానంతో మేజర్ తన దగ్గర ఉన్న గ్రానైట్ ను ఇంటి లోపలి వేశారు. కాసేపటి వరకు ఎలాంటి సౌండ్స్ రాకపోవడంతో.. వారు చనిపోయి ఉంటారని లోపలి వెళ్లారు మేజర్. కానీ బ్రతికి ఉన్న అల్తాఫ్ మేజర్ ముకుంద్ పై కాల్పులు జరిపాడు. బుల్లెట్స్ దిగినా కూడా మేజర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా అతనిని చంపేశారు. అతని దగ్గర ఉన్న మొబైల్ , ల్యాప్ టాప్ ను తీసుకుని వారి టీం కు ఇచ్చి.. ఆపేరేషన్ సక్సెస్ అని చెప్పి అక్కడే కన్నుమూశారు. మేజర్ టీం ఆ డిజిటల్ డేటా ను అఫీషియల్స్ కు ఇచ్చారు. దానిని డీకోడ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే.. ఆ ఉగ్రవాదులు జరగబోయే జమ్మూ & కాశ్మిర్ ఎలెక్షన్స్ ను టార్గెట్ చేశారు. వారి ప్లాన్ మేజర్ కు ముందు తెలియదు. కానీ అందరిని చంపేశారు. ఒకవేళ మేజర్ కనుక అల్తాఫ్ ను మాత్రమే చంపి మిగిలిన వారిని చంపకపోతే.. ఇండియాకు చాలా నష్టం కలిగేది.

జమ్మూ కాస్మిర్ కు వచ్చే ఎలెక్షన్ ఆఫీసర్స్ ను చంపి.. కనీసం మీ వారిని మీరే కాపాడుకోలేకపోయారు అని… ఇండియాను బ్లేమ్ చేయడమే ఆ ఉగ్రవాదుల టార్గెట్. కానీ మేజర్ ముకుంద్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను చంపి.. ఇండియాను సేవ్ చేశారు. మేజర్ ముకుంద్ త్యాగానికి గుర్తుగా ఇండియన్ గవర్నమెంట్ 2015 జనవరి 26న ‘అశోక చక్ర’ అవార్డు ఇచ్చింది. అంతే కాకుండా తమిళ నాడు రాష్ట్రం నుంచి అశోక చక్ర అవార్డు పొందిన నాల్గవ వ్యక్తి మేజర్ ముకుంద్. భారత యువ సైనికాధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ అసాధారణ జీవితం, లెగసికి ‘అమరన్’ మూవీ అద్దం పట్టబోతోంది. మరి మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments