iDreamPost
android-app
ios-app

Allu Arjun: బన్నీకి ఆ కొత్త హీరోయిన్ చాలా స్పెషల్! సినిమా ఆఫర్ పక్కా! ఎవరా బ్యూటీ?

  • Published Apr 19, 2024 | 9:21 AM Updated Updated Apr 19, 2024 | 9:21 AM

సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చిన కొన్ని ఫొటోలు చేసి అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌.. కొత్త హీరోయిన్‌ చాలా అందంగా ఉంది.. సినిమా ఆఫర్‌ పక్కా అంటున్నారు. పైగా ఆమెతో బన్నీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే..

సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చిన కొన్ని ఫొటోలు చేసి అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌.. కొత్త హీరోయిన్‌ చాలా అందంగా ఉంది.. సినిమా ఆఫర్‌ పక్కా అంటున్నారు. పైగా ఆమెతో బన్నీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే..

  • Published Apr 19, 2024 | 9:21 AMUpdated Apr 19, 2024 | 9:21 AM
Allu Arjun: బన్నీకి ఆ కొత్త హీరోయిన్ చాలా స్పెషల్! సినిమా ఆఫర్ పక్కా! ఎవరా బ్యూటీ?

అల్లు అర్జున్‌.. అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తాత అల్లు రామలింగయ్య వారసుడిగా.. బడా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఇచ్చాడు. కానీ కష్టపడి నటనలో తనకు తాను మెరుగులు దిద్దుకుంటూ.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకునే స్థాయికి ఎదిగాడు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి హీరోగా సరికొత్త రికార్డు సృష్టించాడు అల్లు అర్జున్‌. ఇక మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ తో బిజీగా ఉన్నాడు. తాజాగా రిలీజ్‌ చేసిన పుష్ప 2 టీజర్‌.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీతో మరోసారి బాక్సాఫీస్‌ మీద దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాడు బన్నీ.

ఇక పుష్ప సినిమా తర్వాత బన్నీ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన నటించేందుకు సౌత్‌ వాళ్లే కాక బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఒక్క చాన్స్‌ వస్తే చాలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్‌ మీడియాలో ఓ కొత్త హీరోయిన్‌ దర్శనమిచ్చింది. పైగా ఆమె బన్నీకి చాలా స్పెషల్‌ అంటున్నారు అభిమానులు. అల్లు అర్జున్‌ తర్వాతి సినిమాలో ఆమెకు కచ్చితంగా అవకాశం కల్పిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఫ్యాన్స్‌. ఇంతకు ఎవరా బ్యూటీ.. బన్నీకి ఆమెతో ఉన్న ప్రత్యేక బంధం ఏంటి అంటే..

​కొత్త హీరోయిన్‌కు బన్నీ తన సినిమాలో చాన్స్‌ ఇవ్వబోతున్నాడు అనగానే అందరి దృష్టి.. టాప్‌ హీరోయిన్ల మీద పడుతుంది. కానీ వారిని తలదన్నే అందం, గ్లామర్‌ బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి సొంతం. వీరి వివాహం అయ్యి దశాబ్దం పైగానే అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా. కానీ ఏళ్లు గడిచే కొద్ది అల్లు స్నేహ అందం పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బన్నీ స్టైలీష్‌ లుక్స్‌కి ధీటుగా.. స్నేహా రెడ్డి తన గ్లామర్‌ మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. ఈ మధ్యే ఓ యాడ్‌లో నటించిన స్నేహా రెడ్డి.. ఇక సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటారు.

కొత్త కొత్త ఫొటో షూట్‌లతో బిజీగా ఉంటారు. ఈక్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం ఆమె ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ కలర్‌ కాంబినేషన్‌ డ్రెస్‌లో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న స్నేహా రెడ్డి చూస్తే మతి పోవడం ఖాయం. ఎంతో అందంగా మెరిసిపోతూ.. హీరోయిన్స్‌ కూడా తన ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉన్నారు. పెళ్లై.. ఇద్దరు పిల్లలకు తల్లైనా సరే.. అల్లు స్నేహా బ్యూటీ ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు రోజు రోజుకు మరింత అందంగా తయారవుతున్నారు. ఇక ఆమె బాడీ మెయిన్‌టేన్‌ చేసే విధానం చూస్తే.. టాప్‌ హీరోయిన్లే ఆశ్చర్యపోతారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె ఏమాత్రం బరువు పెరగలేదు.

కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతూ.. యోగా, వ్యాయామాలు చేస్తూ.. మంచి శరీర సౌష్టవాన్ని మెయిన్‌టేన్‌ చేస్తూ.. తన తోటి వారికి.. మహిళలకు ఆదర్శంగా ఉన్నారు అల్లు స్నేహా రెడ్డి. ఇక తాజా ఫొటోల్లో సాగర కన్యలా.. దివి నుంచి దిగివచ్చినా అప్పరసలా అందంగా మెరిసిపోతున్నారు. ఈ పిక్స్‌ చూసిన నెటిజనులు.. మా వదిన ముందు మిగతా హీరోయిన్లు అసలు పనికి రారు.. వారి కంటే అల్లు స్నేహనే చాలా అందంగా ఉన్నారు. బన్నీనే ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని సరదాగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పిక్స్‌ చూసిన నెటిజనులు కూడా ఇందుకు మద్దతిస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ భార్య అంటే ఆమాత్రం ఉండాలి అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap