iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో అయి ఉండి రోడ్డుపై అలా క్యాజువల్‌గా నడిచొస్తున్నాడేంటి? ఎవరో గుర్తుపట్టారా?

  • Published Aug 19, 2024 | 8:42 PM Updated Updated Aug 19, 2024 | 8:42 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా..? క్యాజువల్‌గా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఈ హీరో పాన్ ఇండియన్ స్టార్..? ఎవరో చెప్పుకోండి చూద్దాం

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా..? క్యాజువల్‌గా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఈ హీరో పాన్ ఇండియన్ స్టార్..? ఎవరో చెప్పుకోండి చూద్దాం

  • Published Aug 19, 2024 | 8:42 PMUpdated Aug 19, 2024 | 8:42 PM
స్టార్ హీరో అయి ఉండి రోడ్డుపై అలా క్యాజువల్‌గా నడిచొస్తున్నాడేంటి? ఎవరో గుర్తుపట్టారా?

కొంత మంది హీరోలకు తాము స్టార్ట్స్‌మన్న ఇగో ఉండదు. వెరీ డౌన్ టు ఎర్త్ ఉంటారు. కోట్లు సంపాదిస్తున్నా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందులో ముందు వరుసలో ఉంటాడు.. ఈ హీరో. రోడ్డుపై అత్యంత సామాన్యుడిలా నడిచి వెళ్తున్న ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా, సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఇంచిత్ గర్వం లేని నటుడు. అందుకే రోడ్ సైడ్ హోటల్స్‌లో భోజనం చేస్తాడు. తన ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్లకు చేతనైన సాయం చేస్తూ.. మంచి మనిషికి మరో రూపం అయ్యాడు. అలాగే వయనాడ్ వరద బాధితులకు ముందుగా ఆర్థిక సాయం అందించి.. మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడు. అతడే మన అల్లు అర్జున్.. అలియాస్ పుష్ప రాజ్.

అవును ఈ ఫొటోలో నార్మల్ పీపుల్‌లా కనిపిస్తున్నది అల్లు వారి పిల్లగాడు బన్నీనే. బ్లాక్ అవుట్ ఫిట్‌లో సాదాసీదాగా నడుచుకుంటూ వస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాను కోరుకుంటే చిటికెలో అన్ని తన కాళ్ల దగ్గరకు తెప్పించుకోగల బన్నీ.. ఇలా కాలినడక మీద రావడం ఏంటా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏదైమైనా.. అల్లు అర్జున్‌ని ఇలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే పుష్ప గెటప్‌లో ఉండటం వల్ల కొంత మంది అల్లు అర్జునా కాదా అనుకుంటూ చూసుకుంటూ వెళుతున్నారు. మొత్తానికి బన్నీ బాబు సింప్లిసిటీకి బాప్‌లా ఉన్నాడు అంటూ కొనియాడుతున్నారు. ఈ వీడియోతో మరోసారి ట్రెండింగ్‌లో నిలిచాడు పుష్పరాజ్

ఇక సినిమాల విషయానికి వస్తే.. 2021లో విడుదలైన పుష్ప తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు బన్నీ. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఈ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేసేది. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోవడం వల్ల.. మూవీ విడుదల ఈ ఏడాది చివరకు పోస్ట్ పోన్ అయ్యింది. డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా బాగా వచ్చేందుకు ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అల్లు అర్జున్, సుకుమార్. దీని వల్ల పుకార్లు వచ్చిన పట్టించుకోకుండా వర్క్ మీదే ధ్యాస పెడుతున్నారు. సుమారు 60-80 శాతం వరకు షూటింగ్ పూర్తయ్యినట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మైత్రీ మూమీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవీ  శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio