iDreamPost
android-app
ios-app

దుబాయ్‌లో తన సొంత మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు అర్జున్!

  • Published Mar 28, 2024 | 7:04 PM Updated Updated Mar 28, 2024 | 7:04 PM

Allu Arjun Unveils his Wax Statue: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బన్నీ డైలాగ్స్, మేనరీజం ఇప్పటికీ కొంతమంది ఫాలో అవుతున్నారు.

Allu Arjun Unveils his Wax Statue: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బన్నీ డైలాగ్స్, మేనరీజం ఇప్పటికీ కొంతమంది ఫాలో అవుతున్నారు.

  • Published Mar 28, 2024 | 7:04 PMUpdated Mar 28, 2024 | 7:04 PM
దుబాయ్‌లో తన సొంత మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు అర్జున్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డ్యాన్, ఫైట్స్, నటన ఇలా అన్ని విషయాల్లో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా లేవెల్లో దుమ్మురేపాడు అల్లు అర్జున్. తాజాగా మేడమ్ టుస్సాడ్స్ బన్నీ మైనపు విగ్రహావిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ చిత్రం ప్రపపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించింది. ఇందులో పాటలు, డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరీజం ఎంతోమంది ఫాలో అయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు 2021 ఏడాదికి గాను 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. తెలుగు ఇండస్ట్రీలో తొలి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం మరో విశేషం. అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ లో మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వివిధ రంగాల్లో అసమానమైన ప్రతిభ కనబర్చిన విశిష్ట వ్యక్తులకు సంబంధించిన మైనపు విగ్రహాలతో సత్కరిస్తుంటారు. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది స్టార్ నటీనటుల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన అభిమానులు ఎంతో గర్విస్తున్నారు. గురవారం, మార్చి 28 న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ‘అల వైకుంఠపురుములో’ మూవీలోని ఒక స్టిల్ తో విగ్రహం తయారు చేశారు. ఇటీవల కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లిన బన్నీ తన సొంత విగ్రహం పక్కన నిలబడి ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫోటో బ్యాక్ స్టిల్ మాత్రమే ఫోటోలో కనిపిస్తుంది. మరి ఫ్రంట్ సైడ్ స్టిల్ ఎప్పుడు రివీల్ చేస్తారో చూడాలి. ‘మేడం టుస్సాడ్స్ లో నేడు మైనపు విగ్రహ ఆవిష్కరణ. ప్రతి కళాకారుడికి ఇదో గొప్ప మైలురాయి. ‘ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ తో ఫోటో షేర్ చేశాడు బన్ని.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş