iDreamPost
android-app
ios-app

జవాన్ తర్వాత.. మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీకి బన్నీ నో చెప్పేశాడా..?

  • Author ajaykrishna Published - 10:20 AM, Wed - 9 August 23
  • Author ajaykrishna Published - 10:20 AM, Wed - 9 August 23
జవాన్ తర్వాత.. మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ మూవీకి బన్నీ నో చెప్పేశాడా..?

పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ ఒక్క సినిమాతో ఎన్నో అవార్డులు అందుకొని.. పుష్పరాజ్ క్యారెక్టర్ కి జనాలను బాగా కనెక్ట్ చేసేశాడు. పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీకి వేరే భాషల నుండి కూడా చాలా ఆఫర్స్ రావడం మొదలైంది. కానీ.. పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని.. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు బన్నీ. ఈ క్రమంలో స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ కి కూడా నో చెప్పేస్తున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ బాద్షా నటించిన జవాన్ సినిమాలో క్యారెక్టర్ ఆఫర్ వస్తే.. నో అని చెప్పేసాడట. అదే విధంగా తాజాగా మరో సినిమాకి నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పుష్ప తర్వాత బన్నీ క్రేజ్ బాలీవుడ్ లోను పెరిగిపోయింది. అందుకే.. స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీలో బన్నీని చూడాలని ఉత్తరాది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. రీసెంట్ గా ఓ క్రేజీ హైబడ్జెట్ బాలీవుడ్ మూవీకి నో చెప్పాడట. ఆ వివరాల్లోకి వెళ్తే.. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమా వచ్చింది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఆ సినిమాని.. డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించాడు. డెబ్యూ మూవీతో సాలిడ్ హిట్ కొట్టేసరికి ఆదిత్య పై ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఉరి సినిమా తర్వాత.. చాలా గ్యాప్ తీసుకొని ‘అమర్‌ అశ్వథ్థామ’ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో తన ఫస్ట్ హీరో విక్కీ కౌశల్ తోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఎందుకో గానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి విక్కీ తప్పుకున్నాడట.

కట్ చేస్తే.. ఇప్పుడా ఆఫర్ బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ ని దాటుకొని.. అల్లు అర్జున్ ని చేరిందట. అయితే.. ప్రాజెక్ట్ గురించి ఇంటరెస్ట్ ఉన్నప్పటికీ.. బన్నీ సినిమాని ఓకే చేసేందుకు సంకోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. పుష్ప లాంటి మాస్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిన జనాలు.. ఒక్కసారిగా అశ్వథ్థామ అనే ఇతిహాసం కథలో తన పాత్రకు కనెక్ట్‌ అవుతారో లేదోనని ఆలోచన చేసి.. చివరికి వదులుకున్నట్లు టాక్. ఇక ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ ఆధారంగా ఎక్కువ సీన్స్ ఉండనున్నాయి. అది తన కెరీర్ కి ఛాలెంజ్ గా మారనుందని బన్నీ భావించి.. నో చెప్పేసాడని వినికిడి. ఈ లెక్కన బన్నీ బాలీవుడ్ నుండి వచ్చిన రెండు బిగ్ ప్రాజెక్ట్ లకు నో చెప్పినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి బన్నీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom