iDreamPost
android-app
ios-app

ఐకాన్ స్టార్ క్రేజ్! సోషల్ మీడియాలో మరో కొత్త రికార్డు!

  • Author ajaykrishna Published - 12:12 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 12:12 PM, Tue - 25 July 23
ఐకాన్ స్టార్ క్రేజ్! సోషల్ మీడియాలో మరో కొత్త రికార్డు!

సాధారణంగా రీజియన్ హీరోలకు పాన్ ఇండియా క్రేజ్ రావాలంటే ఒక్క సినిమా కుదిరితే చాలు. ఆ తర్వాత పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ పోయేందుకు ఆస్కారం దొరుకుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఆ ఒక్క సినిమానే పుష్ప. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో బన్నీ క్రేజ్ ఎక్కడివరకు విస్తరించిందో తెలిసిందే. ముఖ్యంగా ఇండియాలో పుష్ప అంటే తెలియని వారు ఉండరు. పుష్ప క్రేజ్ తో బన్నీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. అయితే.. తాజాగా సోషల్ మీడియాలో బన్నీ మరో క్రేజీ ఫీట్ అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో బన్నీ ఫాలోయింగ్ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా.. థ్రెడ్స్ యాప్ లోను బన్నీ తన మార్క్ చూపించాడు. ఇటీవల ట్విట్టర్ కి పోటీగా థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన విషయం తెలుసు కదా.. అది లాంచ్ అయిన మొదటి వారంలోనే పది కోట్లకు పైగా యూజర్లను రాబట్టి.. సంచలనం సృష్టించింది. అయితే.. అది లాంచ్ అయినప్పుడే అందులో చేరిన బన్నీ.. ఫస్ట్ తెలుగు యాక్టర్ గా నిలిచాడు. ఇప్పుడు కొత్తగా మరో రికార్డు అందుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు. థ్రెడ్స్ యాప్‌ లో 1 మిలియన్ కంటే ఎక్కువమంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా బన్నీ అరుదైన ఫీట్ సాధించాడు.

ప్రెజెంట్ ఈ విషయాన్నీ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పై దృష్టి పెట్టాడు. పుష్ప తెచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని.. పుష్ప పార్ట్ 2 కోసం మరింత ఎక్కువ కష్టపడుతున్నాడని ఇదివరకే డైరెక్టర్ సుకుమార్ తెలిపాడు. ఆల్రెడీ షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుంది. కాగా.. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి.. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో నాలుగో సినిమా చేయనున్నాడు. మరి బన్నీ పుష్ప 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş