iDreamPost
android-app
ios-app

‘పుష్ప 2’ డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్! వైరలవుతున్న వీడియో

  • Author Soma Sekhar Updated - 01:48 PM, Fri - 21 July 23
  • Author Soma Sekhar Updated - 01:48 PM, Fri - 21 July 23
‘పుష్ప 2’ డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్! వైరలవుతున్న వీడియో

సాధారణంగా హీరోలు, డైరెక్టర్లు రిలీజ్ కు ముందు తమ సినిమాకు సంబంధించిన ఏ చిన్న సీన్ ను గానీ, డైలాగ్ ను కానీ లీక్ చేయడానికి ఇష్టపడరు. కానీ కొంత మంది దొంగచాటుగా తీసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తుంటాయి. ఇదంత ఒకవైపు అయితే హీరోనే తమ సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ ఇస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య కొన్ని ఫంక్షన్స్ లో అనుకోకుండా తమ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను లీక్ చేస్తుంటారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పుష్ప 2 లోని ఓ డైలాగ్ ను తానే స్వయంగా చెప్పి లీక్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప ది రైజ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన పుష్ప ఎక్కడ అనే టీజర్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూడసాగారు. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీలోని ఓ డైలాగ్ ను స్వయంగా అల్లు అర్జున్ లీక్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలో అప్రిసియేషన్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనకు బేబీ సినిమా నచ్చిందని, మూవీ యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు బన్నీ. కాగా.. బన్నీ మాట్లాడుతుండగా.. పుష్ప డైలాగ్ కావాలని అభిమానులు అరుపులతో హోరెత్తించడంతో.. వారి కోరిక మేరకు బన్నీ డైలాగ్ చెప్పాడు. “ఈడంతా ఒకటే రూల్ మీద జరుతాది.. అది పుష్ప గాడి రూల్” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేశాడు ఐకాన్ స్టార్. కాగా.. ఈ చిత్రం తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు మేకర్స్.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet